టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన కొత్త చిత్రం స్పై. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ కాన్సెప్ట్ పై తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. యూఎస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ కూడా అందుకుంది. కానీ ఈ సినిమా విడుదలకు ముందున్న అంచనాలను అందుకోలేదని టాక్ వినిపిస్తోంది. సినిమాకు ఇలాంటి టాక్ రావడానికి కారణం నిఖిల్ ఓ సమావేశంలో మాట్లాడిన మాటలే అని కొందరు అంటున్నారు. ఆ ఒక్క మాటే నిఖిల్ కొంప ముంచేసిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్నాడు . ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. సినిమా కథలో కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ ..ఎక్కడో నిఖిల్ రేంజ్ కు ఆ కథ మ్యాచ్ అవ్వలేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మరికొందరు కావాలని ఈ సినిమాని ప్లాప్ చేస్తున్నారని అనుకుంటున్నారు. హీరో నిఖిల్ తన తాజా చిత్రం స్పై సినిమా ప్రమోషన్స్ లో “మా వైపు ఏ మీడియా.. ఏ పొలిటికల్ పార్టీ లేదని ..నేను ప్రజల వ్యక్తిని అని ..వాళ్ల నుంచే నేను వచ్చాను” అంటూ మాట్లాడాడు. ఈ క్రమంలోనే కావాలనే ఆయన ‘స్పై’ సినిమాను టార్గెట్ చేసి కొందరు రాజకీయ నేతలు సినిమా ప్లాప్ చేశారన్న కామెంట్లు వినిపించాయి. మొత్తానికి ఏదో అనుకుని సినిమాలో నటించిన నిఖిల్ కి ఇంకేదో రిజల్ట్ చూపించారు ప్రేక్షకులు. అయితే కొంతమంది ఈ సినిమా బాగుంది అంటున్నప్పటికీ చాలామంది బాగాలేదు అన్న టాక్ ఎక్కువుగా వినిపిస్తుంది.