యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఆదిపురుష్ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా డిజాస్టర్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది కానీ, వివాదాలు కూడా ఈ చిత్రాన్ని ఆ రేంజ్ లోనే చుట్టుముట్టాయి.
విడుదలకు ముందే ఈ సినిమాపై చాలా వివాదాలు ఏర్పడ్డాయి, ఇక విడుదల తర్వాత సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఇది రామాయణమా అని దర్శకత్వం వహించిన ఓం రౌత్ ని, అందులో నటించడానికి ఒప్పుకున్నా ప్రభాస్ ని దారుణంగా తిడుతున్నారు. ఇక నార్త్ ఇండియా లో అయితే ఈ సినిమాని బ్యాన్ చెయ్యాలి అంటూ పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తున్నారు. దీనిపై రీసెంట్ గా అలహాబాద్ హై కోర్టు కూడా చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
హై కోర్టు జడ్జీ మాట్లాడుతూ ‘ఇలాంటి డైలాగ్స్ అసలు సినిమాలో ఎలా పెట్టారు, అసలు ఎలా తీశారు ఈ సినిమాని, పవిత్రమైన రామాయణం ని ఇలా చూపిస్తారా’ అంటూ విరుచుకుపడింది. అప్పుడు సినిమా తరుపున న్యాయవాది, ఇది కేవలం రామాయణం ని ఆదర్శంగా తీసుకొని చేసిన సినిమానే కానీ, రామాయణం కాదని చెప్పగా , దానికి జడ్జీ స్పందిస్తూ ‘రాముడు , లక్ష్మణుడు, సీత , రావణుడు ని చూపించి, రామాయణం లోని ఘట్టాలను మొత్తం తెరకెక్కించి రామాయణం కాదు అంటారా..మమల్ని పిచ్చివాళ్ళని చేద్దాం అనుకుంటున్నారా, అసలు సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతిని ఎలా ఇచ్చింది?’ అంటూ ఈ చిత్రం పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాడు.
నార్త్ ఇండియా లో రామాయణం ని మరియు శ్రీరాముడిని ఎంతో పవిత్రం గా భావిస్తారు. #RRR చిత్రం లో రామ్ చరణ్ కాసేపు రాముడి గెటప్ లో కనిపిస్తేనే ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. అలాంటిది పూర్తి స్థాయి రామాయణం తో సినిమా తీస్తే అక్కడి జనాలు ఏ రేంజ్ లో ఆదరిస్తారో అర్థం ఊహించొచ్చు. అలాంటిది ఉన్న రామాయణం ని అపహాస్యం చేస్తూ ‘ఆదిపురుష్’ చిత్రం ప్రభాస్ పై చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది అనే చెప్పాలి, దీని ఇంప్యాక్ట్ ఆయన రాబొయ్యే సినిమాల మీద కూడా ఉండొచ్చు.