ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా కెరీర్ పై ద్రుష్టి పెట్టింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. సమంత ఇటీవల టామీ హిల్ ఫిగర్ యాడ్‌లో కనిపించింది. సినిమాల్లో స్లిమ్ గా కనిపించే ఈ బ్యూటీ.. టామీ హిల్ ఫిగర్ యాడ్ లో కాస్త బొద్దుగా అయినట్లు కనిపిస్తోంది. దీంతో సమంత అభిమానులు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అంతర్జాతీయ బ్రాండ్ టామీ హిల్ ఫిగర్ రిస్ట్ వాచ్ బ్రాండ్‌కు సమంత ప్రమోటర్ గా వ్యవహరిస్తోంది.
అయితే ఈ యాడ్ కోసం సమంత భారీగానే చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. సమంత ఇలాంటి యాడ్స్‌లో నటించడం ఇదే మొదటిసారి కాదు. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడు సమంత ఇలాంటి చాలా యాడ్స్ చేసింది. అయితే తాజాగా టామీ హిల్ ఫిగర్ యాడ్ కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ తో మరోసారి తన రేంజ్ ని గుర్తు చేసింది. అయితే ఈ యాడ్ కోసం సమంత అసలు ఎంత తీసుకుందన్న ప్రశ్న చాలా మంది మదిలో మొదలైంది. ఫిగర్ యాడ్ కోసం సమంత టామీ హిల్ కంపెనీ నుంచి దాదాపు రూ.2 నుంచి రూ.3 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. సినిమాల్లో నటించినందుకు తీసుకునే రెమ్యూనరేషన్‌తో సమానంగా ఆ యాడ్‌కి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలని సమంత డిమాండ్ చేసిందంట. అయితే సమంతకు ఉన్న క్రేజ్ ని బట్టి చూస్తే రెండు మూడు కోట్లు అంటే పెద్ద విషయం కాదని చాలా మంది అంటున్నారు.