టాలీవుడ్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ ఈరోజు (జూన్ 18) కన్నుమూశారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు అవ్వడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబసభ్యులు. ఇక అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులంతా రాకేష్ మాస్టర్ తో ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
కాగా, రాకేష్ మాస్టర్ మృతిపై ఆయన అసిస్టెంట్ సాజిద్ స్పందించారు. రాకేష్ మాస్టర్ బతకడం కష్టమని రెండు నెలల క్రితమే డాక్టర్లు చెప్పారని సాజిద్ వెల్లడించారు. తాను రాకేష్ మాస్టర్‌కు ఎడిటర్‌గా పనిచేశానని.. తనపై నమ్మకంతో ప్రతి విషయానికి తననే పిలుస్తారని సాజిద్ చెప్పారు. ‘హనుమాన్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో పాల్గొన్న రాకేష్ మాస్టర్.. ఆ సమయంలోనే రక్తపు విరోచనాలు, వాంతులు చేసుకున్నారని సాజిద్ వెల్లడించారు. అప్పుడు తానే హాస్పిటల్‌కు తీసుకెళ్లానని.. పరీక్షలు చేసిన వైద్యులు బతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు.
‘డాక్టర్లు చెప్పిన తరవాత రాకేష్ మాస్టర్ నెలన్నరపాటు మద్యం తాగడం ఆపేశారు. ఆ తరవాత కొంతమంది ఆయనపై అభిమానంతో మద్యం తాగించారు. దీంతో ఆయన మళ్లీ మొదలుపెట్టారు. ఇక మ్యాన్షన్ హౌస్ మై హౌస్ షో చేయడానికి విజయనగరం వెళ్లారు’ అని సాజిద్ చెప్పుకొచ్చారు. ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్‌తో కూడా రాకేష్ మాస్టర్ ఒక షో ప్లాన్ చేశారని సాజిద్ వెల్లడించారు. ఇప్పుడు జరుగుతున్న షో పూర్తికాగానే ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్‌తో షో చేయాల్సి ఉందని.. ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని సాజిద్ ఆవేదన వ్యక్తం చేశారు.