పెళ్లయ్యాక పదేళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు తల్లి దండ్రులు కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మెగా ఫ్యామిలీలో మరో తరం అడుగుపెడుతుంటడంతో అంతా ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు పుట్టిబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ఉపాసన కీలక నిర్ణయం తీసుకుంది. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే.
ఎప్పుడైతే ఉపాసన ప్రెగ్నెన్సీ న్యూస్ అధికారికంగా బయటకొచ్చిందో.. అప్పటినుంచి రామ్ చరణ్ దంపతులకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె అనేక విషయాలు షేర్ చేసింది.‘‘సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారు. కానీ, మేము దానికి పూర్తి భిన్నం. ప్రస్తుతం చరణ్ నేనూ.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నాం. బేబీ పుట్టిన తర్వాత మేము అత్తమామల (చిరంజీవి-సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే, మా (చరణ్, ఉపాసన) ఎదుగుదలలో గ్రాండ్ పేరంట్స్ కీలకపాత్ర పోషించారు.
వాళ్ల నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గ్రాండ్ పేరంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని మేము మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు’’ అని ఉపాసన చెప్పారు. అనంతరం, ప్రెగ్నెన్సీ గురించి చరణ్‌కు చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో చెబుతూ.. ‘‘ప్రెగ్నెంట్ అయ్యానేమోనని సందేహంగా ఉందంటూ మొదటిసారి చరణ్‌కు చెప్పాను. కన్ఫార్మ్ అయ్యాక ఆయన ఎంతో సంతోషించారు. తన స్టైల్లో సెలబ్రేట్ చేశారు’’ అని ఆమె తెలిపారు.