Inaya Marraige : బిగ్ బాస్..బిగ్ బాస్ ..ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది..గతంలో జరిగిన ఐదు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ పరమ చెత్తగా ఉందంటూ ప్రేక్షకుల్లో టాక్ ను అందుకుంది.షో మొదలైన కొద్ది రోజులకే ఎన్నో రూమర్స్ ను అందుకుంది..ఆ మధ్య కోర్టు నోటిసులు కూడా అందుకుంది.. అయినా బ్రేక్ ఇవ్వకుండా జరుగుతుంది.. ప్రస్తుతం సీజన్ 6 షో ముగింపుకు చేరుకుంది.మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే జరుపుకుంటుంది..ఈ సీజన్ లో వచ్చిన హౌస్ మేట్స్ పెద్దగా ఆకట్టుకోలేదని ఇప్పటికీ జనాల్లొ ఓ వార్త వినిపిస్తోంది..
గత వారం ఊహించని రీతీలో హౌస్లొ స్ట్రాంగ్ గా ఉండే ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లో లేడీ టైగర్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఒక సామాన్యు రాలిగా హౌస్లో అడుగుపెట్టిన ఇనయా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు.. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ దుమారం రెపుతుంది.. అన్యాయంగా చేసారని భాధ పడింది. పలు చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫెమస్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని ఆమె బిగ్ బాస్ రాక ముందు వచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది. తన లైఫ్ గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్ళి కూతురుగా రెడీ అయిన ఒక ఫోటో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ.. ఇనయాకు ఆల్రెడీ వివాహం జరిగిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఆ ఫోటోలో ఆమె పెళ్లి కూతురో కాదో స్పష్టత లేదు. అలాగే పక్కన ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. కేవలం ఒక ఫోటో ఆధారంగా పెళ్లి జరిగిందన్న నిర్ణయానికి రాలేమని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఫోటోలు ఎవరైనా తీసుకోవచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ అమ్మడు 14 వారాలు ఉండటం మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో ఫెమ్ బాల ఆదిత్య, చలాకీ చంటి, పింకీ, ఫైమా వంటి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. వారితో పోల్చుకుంటే అసలు ఇనయా ఎవరో కూడా తెలియదు. కేవలం రామ్ గోపాల్ వర్మతో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హౌస్ లో నామినేషన్స్ లో ఉన్నప్పుడు వర్మ ఆమెకు సప్పోర్ట్ చేశారు. చివరి నిమిషంలో వదిలేశాడు. 14వ వారం ఎలిమినేషన్స్ లోకి వచ్చినప్పటికీ వర్మ ఆమె కోసం ఏమి చెయ్యలేక పోవడం విశేషం..సూర్య తో లవ్ ట్రాక్ నడిపిందని ఆ మధ్య వార్తలు కూడా వినిపించాయి..ఈ అమ్మడు ఎలాంటి ఆఫర్లను అందుకుంటుందో చూడాలి మరి..