Avatar 2 Review : జేమ్స్ కామెరాన్ అద్బుత సృష్టి మరోసారి వండర్ చేసింది.

- Advertisement -

Avatar 2 Review : ‘అవతార్‌ 2’ ది వే ఆఫ్ వాటర్ (Avatar 2: The Way of Water) సినిమాను చూసేందుకు రెడీ అయ్యారా..? ఇప్పటికే టికెట్‌ బుక్‌ చేసుకొని, కొత్త ప్రపంచాన్ని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారా?  13 ఏళ్ల క్రితం విడుదలైన ‘అవతార్‌’ కు సీక్వెల్ గా అవతార్ -2 రిలీజ్ అయింది. ఇన్నేళ్ల తర్వాత దాని సీక్వెల్‌ గా రిలీజ్ అయిన కొత్త అవతార్‌లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా.. జేమ్స్ కామెరూన్ మరోసారి తన మాయ చూపించాడా.. అదిరిపోయే విజువల్స్ మళ్లీ మ్యాజిక్ చేశాడా.. ఇవాళ విడుదలైన అవతార్ -2 ది వే ఆఫ్ వాటర్ ఎలా ఉందో తెలుసుకుందామా..

Avatar 2 review
Avatar 2 review

అవతార్ -2  స్టోరీ ఏంటంటే? : అవతార్ కోసం జేమ్స్ కామెరున్, సాంకేతికత సాయంతో ‘పండోరా’ అనే ప్రపంచాన్ని సృష్టించారు. అక్కడ ‘నావి’ అనే అటవీ తెగ జీవిస్తుంటుంది. ప్రకృతే ప్రాణంగా జీవించే ఆ వింత ప్రాణులకు, అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్లే మానవులకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా థీమ్. ఇక ‘అవతార్-2’ కథలోకి తొంగి చూడబోయేముందు, తప్పకుండా ‘అవతార్-1’ను గుర్తుంచుకున్నవారికే ఈ సినిమా అర్థమవుతుంది.

- Advertisement -

లేదంటే కాసింత కంగాళీగా ఉంటుంది. అయినప్పటికీ కట్టిపడేసే విజువల్ వండర్ గా జేమ్స్ కేమరాన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథలోకి వద్దాం- భూలోకం నుండి పండోరా గ్రహానికి వెళ్ళిన జేక్ సల్లీ అక్కడివారికి మానవులు అన్యాయం చేస్తున్నారని గ్రహిస్తాడు. తన సొంత మనుషులపైకే ఎదురు తిరుగుతాడు. పండోరాలో ఓ తెగకు చెందిన నాయకుని కూతురు నేతిరిని జేక్ సల్లీ ప్రేమించడం, అక్కడే నిలచిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది.

Avatar 2
Avatar 2

తరువాత జేక్ సల్లీ, తన భార్య నేతిరి తండ్రి తరువాత తానే ఓమటికాయ తెగకు నాయకుడై ఉంటాడు. ఆ దంపతులకు నెటెయమ్, లోక్ కొడుకులు, టక్ అనే కూతురు, కిరి అనే పెంపుడు కూతురు ఉంటారు. వారితో పాటే స్పైడర్ అనే మానవబాలుడు కలసి ఉంటాడు. పండోరాను ఆక్రమించుకోవడమే ధ్యేయంగా ఉన్న మైల్స్ క్వారిచ్ కొడుకే స్పైడర్.

అయితే ఆ బాబును భూలోకం పంపడానికి సరైన సాధనం లభించక పోవడంతో జేక్ చెంతనే ఉంటాడు స్పైడర్. మొదటి నుంచీ పండోరా ప్రకృతివనరులపై కన్నేసిన కొందరు స్వార్థపరులు మళ్ళీ భూలోకం నుండి ఆ గ్రహంపైకి దండెత్తుతారు. వారికి నాయకునిగా క్వారిచ్ నా’వి బాడీతో వస్తాడు. జేక్ గెరిల్లా దాడికి సిద్ధమవుతాడు. క్వారిచ్ మనుషులు జేక్ పిల్లలను బంధిస్తారు. క్వారిచ్ కు స్పైడర్ తన కొడుకే అన్న నిజం తెలుస్తుంది. జేక్ ను మట్టుపెట్టడం, తన కొడుకు స్పైడర్ ను తనతో తీసుకెళ్ళడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంటాడు క్వారిచ్.

జేక్ తన కుటుంబాన్ని విడిపించుకొని మెట్కాయినా ప్రాంతానికి వెళతాడు. అక్కడ టోనోవరి, అతని భార్య రోనాల్ పాలిస్తుంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళాక జేక్ కొడుకు లోక్ ఆ ప్రాంతనాయకుని కూతురు సిరేయాతో అనుబంధం పెంచుకుంటాడు. ఇది ఆమె అన్న ఓనంగ్ కు నచ్చదు. లోక్, ఓనంగ్ పోట్లాడతారు. జేక్ సూచనతో వారిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అయితే ఓనంగ్, లోక్ ను తీసుకువెళ్ళి భయంకరమైన జలచరాలుండే చోట పడేస్తాడు.

avatar-2

లోక్ ను పాయకన్ అనే జలచరం రక్షిస్తుంది. జేక్ పిల్లలు సముద్రంతో ఎంతో అనుబంధం పెంచుకుంటారు. క్వారిచ్ ఎలాగైనా జేక్ ను అంతమొందించాలనే చూస్తాడు. ఇది స్పైడర్ కు నచ్చదు. అతను తన తండ్రికే వ్యతిరేకంగా పోరాడతాడు. దాంతో క్వారిచ్ స్పైడర్ తన కొడుకు కాదని భావిస్తాడు. కానీ, నేతిరి రుజువు చేస్తుంది. ఇలా మలుపులు తిరిగిన కథ చివరకు ఏమవుతుంది? జేక్ ను అంతమొందించాలనుకున్న క్వారిచ్ ఏం చేశాడు? జేక్ కొత్త ప్రాంతంలో మనగలిగాడా? అక్కడి నాయకుని కొడుకు జేక్ కొడుకు లోక్ ను మళ్ళీ ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా మిగిలిన కథ సాగుతుంది.

మూవీ ఎలా ఉందంటే.. అవతార్ సినిమా కథ కోసం దర్శకుడు జేమ్స్ కామెరాన్ క్రియేట్ చేసిన కొత్త ప్రపంచమే ఊహకు అందకుండా ఉంటుంది. ఈ సినిమా కోసం ఉపయోగించిన కంప్యూటర్ గ్రాఫిక్, 3డీ టెక్నాలజీ సినీ ప్రేక్షకులకు అద్బుతమైన అనుభూతిని కలిగిస్తుంది. గ్రాఫిక్ వర్క్ తెర మీద నభూతో నభవిష్యత్‌గా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించింది. ఈ మూవీ సాంకేతిక విలువలు అంతుచిక్కనంత అద్భుతంగా ఉన్నాయి. అడుగడుగునా అబ్బురపరిచే దృశ్యాలతో ఈ సినిమా ప్రేక్షకులను ప్రతి క్షణం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా మన భారతీయతకు దగ్గరగా ఉన్న కథ, కథనం మనల్ని మూవీలో త్వరగా లీనమయ్యేలా చేస్తాయి. 

విజువల్స్ ఎలా ఉన్నాయంటే.. అవతార్ సినిమాకు మారో ఫియరే అందించిన సినిమాటోగ్రఫి ఒక విజువల్ వండర్‌. కొత్త అనుభూతిని అందించే విధంగా జేమ్స్ హోనర్‌ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. మేస్ట్రో జో లెట్టేరి స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. నేవీల రూపు రేఖల కోసం ఉపయోగించిన నీలిరంగు సినిమాకు మంచి ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారిందని చెప్పవచ్చు.

జేమ్స్ కామెరూన్ విజన్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులను, కలెక్షన్లను తుఫాన్‌లా కుమ్మరించింది. ఇలాంటి నేపథ్యంలో అవతార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవతార్ -2 చూస్తుంటే పార్ట్ -1 రికార్డ్స్ ను బద్ధలు కొడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్ట్ -1 కంటే క్రియేటివ్ స్టోరీ.. అదిరిపోయే విజువల్స్.. అంతకుమించిన మాయాజాలం జేమ్స్ కామెరూన్ ఈ సినిమాలో చేశాడు. 

కన్ క్లూజన్ : జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతం చేశాడు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

సినిమా :  అవతార్ -2 ది వే ఆఫ్ వాటర్

నటీనటులు: సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టెఫాన్ ల్యాంగ్ తదితరులు

రచన, నిర్మాత, దర్శకత్వం: జేమ్స్ కామెరాన్

కంపోజర్: సిమోన్ ఫ్రాంగ్లెన్

సినిమాటోగ్రఫీ : రసెల్ కార్పెంటర్

రేటింగ్ : 3/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here