మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి అతి త్వరలోనే జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది.దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా, వాటిని చూసి అభిమానులు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు ఇద్దరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ నిశ్చితార్ధ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైన సంగతి తెలిసిందే.
ఈ నెలాఖరున కానీ, లేదా వచ్చే నెల మొదటి వారం లో కానీ వీళ్లిద్దరి పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. ఈ పెళ్లి పనులన్నీ స్వయంగా నాగబాబు పర్యవేక్షిస్తున్నాడు. అయితే ఈ పెళ్లి కూడా నిహారిక పెళ్లి లాగానే డెస్టినేషన్ వెడ్డింగ్ లాగ చేయబోతున్నారట. రాజస్థాన్ లో నిహారిక మరియు చైతన్య వివాహాన్ని ఎంత ఘనంగా జరిపించారో, మనం ఇప్పటికీ మరచిపోలేము.
‘నిశ్చయ్’ అనే హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కనిపిస్తాయి. వాటిని చూస్తే అభిమానుల కడుపు నిండిపోతుంది. అంత ఘనంగా జరిగింది కాబట్టే, వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లిని కూడా అక్కడే నిర్వహించడానికి చూస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్ళికి కట్టుకోబొయ్యే చీర కూడా అంత్యంత ఖరీదైనదిగా ఉండబోతుందట. దీనిని రాజస్థాన్ లో తయారు చెయ్యిస్తున్నట్టు సమాచారం.
బంగారుపూతతో , అరుదైన సిల్క్ తో ఈ చీరని తయారు చెయ్యిస్తున్నారట. దీని విలువ 40 లక్షల రూపాయలు ఉండబోతుందని సమాచారం. ఇంత విలువైన చీర ని రీసెంట్ టైం లో పెళ్లి చేసుకున్న ఏ సెలబ్రిటీ కూడా ధరించలేదని, మొట్టమొదటిసారి లావణ్య త్రిపాఠి మాత్రమే ఇలాంటి ఖరీదైన చీరని ధరించబోతున్నట్టు సమాచారం. ఇంకా ఈ పెళ్ళికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అతి త్వరలోనే తెలియచెయ్యబోతున్నాడు నాగబాబు.