పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలైన ‘వకీల్ సాబ్’ మరియు ‘భీమ్లా నాయక్’ సినిమాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రేంజ్ లో టార్గెట్ చేసిందో జనాలు అంత తేలికగా మర్చిపోలేరు. అప్పటి వరకు లేని జీవో రేట్స్ ని ఈ సినిమా వచ్చినప్పుడే విడుదల చేసి, అదనపు షోస్ కి పర్మిషన్ ఇవ్వకుండా, థియేటర్స్ గేట్స్ బయట ప్రభుత్వ MRO లను టికెట్స్ చెక్ చేయించడానికి నిల్చోబెట్టాడు.
ఆ పరిస్థితులను ఎదురుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం అనే చెప్పొచ్చు. పెద్ద రేంజ్ లో వసూళ్లను రాబట్టాల్సిన ఆ రెండు సినిమాలు, మామూలు హిట్స్ గా మాత్రమే నిలిచాయి. ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంది. ఇక నుండి పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇతర హీరోలలాగానే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి వెసులుబాటు ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్స్ జీవో లో పొందుపర్చిన అంశాలను గుర్తు చేసుకుంటే, వంద కోట్ల రూపాయిల బడ్జెట్ దాటిన సినిమాలు మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం 20 శాతం షూటింగ్ జరిగిన సినిమాలకు టికెట్ రేటు 50 నుండి వంద రూపాయిల వరకు పెంచుకునే అవకాశం కలిపిస్తామని జగన్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న నాలుగు చిత్రాలలో #OG మరియు హరి హర వీరమల్లు సినిమాలకు వంద కోట్ల రూపాయలకు పైగానే బడ్జెట్ ఖర్చు అయ్యింది. దానికి తోడు ఇక నుండి పవన్ కళ్యాణ్ మంగళగిరి లోనే ఎక్కువ ఉండబోతున్నాడు కాబట్టి మా సినిమా షూటింగ్స్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లోనే జరుపుకుంటాము అంటూ నిర్మాతలు నిన్న అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం పెట్టిన ఈ రెండు ఆంక్షలను పవన్ కళ్యాణ్ సినిమాలు రీచ్ అయ్యాయి కాబట్టి ఇక నుండి ఆయన సినిమాలకు టికెట్ రేట్స్ హైక్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.