మేఘా ఆకాష్.. ఈ అందాల చందమామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన లై
మూవీతో ఈ చిన్నది సినీ కెరీర్ ప్రారంభించింది. తొలి సినిమాతోనే తన అందం, నటనా ప్రతిభతో ఆకట్టుకుంది. అయితే లై చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత చల్ మోహన్ రంగ, రాజ రాజ చోర, డియర్ మేఘా, గుర్తుండ శీతకాలం తదితర చిత్రాల్లో నటించింది.
కానీ, ఇవేమి టాలీవుడ్ లో ఆమెకు సక్సెస్ అందించలేకపోయాయి. తమిళ, హిందీ భాషల్లోనూ మేఘా ఆకాష్ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమెకు నిరాశే ఎదరైంది. తాజాగా ఈ బ్యూటీ రావణాసుర
మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదటి సారి ప్రేమలో పడిన రోజులను గుర్తుతెచ్చుకుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. అలాగే నా జీవితంలోనూ ఉంది అంటూ గతానికి వెళ్లిపోయింది మేఘ. నాలుగో తరగతి చదువు తుండగా ఆమె పక్కన కూర్చునే అబ్బాయిపై ఇష్టం ఏర్పడిందట. అదే ఆమె తొలి ప్రేమట. ఆ తర్వాత చదువు అయిపోయింది. కొన్ని రోజులకు ఆమెకు షారుఖ్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడిందట. అంతేకాదు ఆమె ప్రేమ వివాహాన్నే ఇష్టపడుతుందట. మరి పార్టనర్ సంగతో అంటే… ‘నాకు కాబోయే భాగస్వామి నన్ను నాలా ఉండనివ్వాలి’ అని చెప్పింది మేఘ.