నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ, రాజకీయ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి

- Advertisement -

సినిమాలు, రాజకీయాల్లో వారసుల ఎంట్రీ కామన్‌. ఒక వ్యక్తి హీరోగా నిలదొక్కుకున్నాడంటే.. ఆ తర్వాత అతడి కుటుంబంలో మరి కొందరు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక హీరోలు తమ పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువస్తారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడమే కాక.. కొందరు సూపర్‌ స్టార్లుగా కూడా రాణిస్తున్నారు. ఇక మరికొందరు వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారసుల జాబితాలో.. ముందు వరుసలో ఉన్నాడు నందమూరి మోక్షజ్ఞ.

మోక్షజ్ఞ
మోక్షజ్ఞ

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్. గత కొన్ని నెలలుగా నటసింహం బాలకృష్ణ తనయుడు ఎంట్రీ గురించి జనాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎంట్రీ పక్కా అనే సమాచారాలు వస్తున్నాయి తప్ప.. ఫస్ట్ మూవీ గురించి ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్స్ రావడం లేదు. మరోవైపు తన సినీ ఎంట్రీ కోసం మోక్షజ్ఞ బాగానే శ్రమిస్తున్నారని ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ చూస్తుంటే అర్థమవుతోంది. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారని, మోక్షజ్ఞ కెమెరా ముందుకొచ్చే ఆ క్షణం దగ్గరలోనే ఉందని మాత్రం తెలుస్తోంది.

ఈ పరిస్థితుల నడుమ ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పలు సెలబ్రిటీల జ్యోతిష్యం చెబుతూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న వేణు స్వామి.. నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినిమా భవిష్యత్ ఎలా ఉండనుందో చెప్పారు. మోక్షజ్ఞ సినీ కెరీర్ పై హాట్ కామెంట్స్ చేశారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుంది కానీ.. అది చాలా లేటుగా ఉంటుందని, టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా ఆయన ఎదుగుతారని అన్నారు.

- Advertisement -

సినీ రంగంలో మోక్షజ్ఞకు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పారు వేణు స్వామి. నందమూరి ఫ్యాన్స్ కోరుకునే సినిమాలతో ఆయన ఆకట్టుకుంటాడని అన్నారు. ఇకపోతే నందమూరి వారసుడు కాబట్టి ఎలాగూ పొలిటికల్ యాంగిల్ కూడా చూస్తారు కానీ మోక్షజ్ఞకు రాజకీయ భవిష్యత్ లేదని వేణు స్వామి అన్నారు. అసలు రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ కూడా ఇవ్వడని చెప్పారు. సినిమాలే మోక్షజ్ఞ క్రేజ్ పెంచుతాయని అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here