ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయో అందరికీ తెలిసిందే. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ చిత్రం కంటే 50 శాతం ఎక్కువ రాబట్టింది.
ఒక్క రోజు తేడాతో విడుదలైన రెండు సినిమాల మధ్య రెండిటికీ ఒకే రకమైన టాక్ వచ్చినప్పుడు కలెక్షన్స్ విషయం లో పది కోట్లు తేడా ఉండడం సహజం, కానీ ఏకంగా 70 కోట్ల రూపాయిల తేడా ఉండడం అనేది ఈ రెండు సినిమాల మధ్యనే మనం చూస్తున్నాము. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా క్లోసింగ్ లో 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే , బాలయ్య ‘వీరసింహా రెడ్డి’ చిత్రం కేవలం 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
ఇది బాలయ్య ని కాస్త డిస్టర్బ్ చేసిన విషయం అట. అందుకే పోస్టర్స్ లో ఆయన సింగల్ హ్యాండెడ్ గా హిట్ కొట్టాను అని వేయించుకున్నాడు. ఎందుకంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి తో పాటుగా రవితేజ కూడా ఉన్నాడు కాబట్టి. అందుకే బాలయ్య పోస్టర్స్ మీద పరోక్షంగా చిరంజీవి సినిమాకి కౌంటర్ వేసినట్టుగా గతం లో వార్తలు వినిపించాయి.ఇప్పుడు బాలయ్య బాబు ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీ కొల్లి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.
నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాతో ఎలా అయినా ఆయన ‘వాల్తేరు వీరయ్య’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని కొల్లగొట్టాలి అనే కసితో ఉన్నాడట. మరి బాలయ్య కి అంత మార్కెట్ ఉందా?, ఆ రేంజ్ వసూళ్లు రావాలి అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు ఉండాలి. మరి మాస్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైన బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఈ సినిమాతో థియేటర్స్ కి రప్పిస్తాడో లేదో చూడాలి.