రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఆదిపురుష్’ చిత్రం హవానే కనిపిస్తుంది. ఎక్కడ చూసిన దీని గురుంచే మాట్లాడుకుంటున్నారు. సమ్మర్ లో రెండు మూడు హిట్ సినిమాలు తప్ప , మొత్తం నష్టాలనే చూసిన టాలీవుడ్ ట్రేడ్ ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తుంది. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ ని అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.
అన్నీ సినిమాల తరహాలో కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు.అంతే కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అన్నీ ప్రాంతాలకు పూర్తి అయ్యింది. కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకే 125 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డ్స్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే 16 వ తారీఖు వరకు ఆగాల్సిందే.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం గురించి ఈరోజు ప్రచారం అయినా ఒక సందేశం సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారింది. అదేమిటి అంటే ‘రామాయణం పారాయణం జరుగుతున్న ప్రాంతం ఎంతో పవిత్రం గా ఉండాలి. ఈ నమ్మకాన్ని విశ్వసిస్తూ, ఆదిపురుష్ థియేటర్స్ లోకి దళితులకు ప్రవేశం లేదు’ అంటూ మూవీ టీం ఒక పత్రిక ప్రకటన చేసినట్టు గా ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనిపై నెగటివిటీ ఒక రేంజ్ లో జరిగింది.
ఇది గమనించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాసేపటి క్రితమే స్పందించి , ‘ఇందులో ఎలాంటి నిజం లేదు, దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు. సినిమాకి సంబంధించి ఏదైనా మేమే తెలియచేస్తాము’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇలాంటి చెట్టాపని ఎవరు చేసి ఉంటారు..?, ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే, ప్రతీ హీరో అభిమాని ప్రభాస్ ని ఇష్టపడుతుంటారు, అలాంటి హీరో సినిమా మీద ఇలాంటి కుట్రలు చెయ్యడానికి ఏమి అవసరం ఉంది? అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.