షూటింగ్ గ్యాప్ దొరికితే సినీ సెలబ్రిటీలు విదేశాల్లో వాలిపోతారు. సరదాగా సేద తీరుతుంటారు. తాజాగా ‘ఖుషి’ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లిన సమంత కూడా అదే పనిలో ఉన్నారు. టర్కీలో ఉన్న సామ్ అక్కడి ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తన గదిలో చిల్ అవుతూనే రూమ్ నుంచి బీచ్ లోకేషన్, పీస్ ఫుల్ క్టైమేట్‌కు సంబంధించిన ఫొటోలూ షేర్ చేసింది.
ఇక అక్కడ షూట్ జరిగిన తరువాత విశ్రాంతి తీసుకోవడానికి కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి అక్కడే మరికొన్నాళ్లు ఉండాలని నిర్ణయించుకుంది. సమంత ఈ మినీ-బ్రేక్‌లో హమామ్ స్పాలో ఎంజాయ్ చేసింది. దాన్ని సాధారణంగా టర్కిష్ బాత్ అని పిలుస్తారు. టర్కిష్ బాత్ అనేది ఒక రకమైన స్టీమ్ స్నానం. దీనిని శరీరాన్ని శుభ్రపరచి, విశ్రాంతి తీసుకునే విధంగా క్రియేట్ చేశారు. స్టీమ్, ఎక్స్‌ఫోలియేషన్, మసాజ్ తో బాడీని రిలాక్స్ అయ్యేలా ఈ ప్రాసెస్ ఉంటుంది.
మరో ఫొటోలో బ్లాక్ అవుట్‌ఫిట్‌లో, బ్లాక్ గాగుల్స్‌తో స్టైలిష్‌గా కనిపించింది. కార్‌లో వెళ్తూ తనకు నచ్చిన బుక్స్ చదువుతోంది. ‘‘టర్కీలో ది బెస్ట్ డేస్’ అనే కామెంట్‌ను జోడించింది. ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరికొందరేమో తిట్టిపోస్తున్నారు.హాలీవుడ్ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక సమంతలో చాలా మార్పు వచ్చిందనుకుంటున్నారు. ఇక టర్కీలో విజయ్ దేవరకొండ, సమంత మీద ఖుషీ సినిమా కోసం అక్కడే ఒక సాంగ్ షూట్ చేశారు. అయితే వారి షెడ్యూల్ గురించి వివరాలు బయటకు రాలేదు. ఇక సమంత ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విజయ్‌తో కలిసి పని చేయగలిగినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.