కొన్ని సూపర్ హిట్ చిత్రాలను ఇప్పుడు చూస్తే చాలా బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే అప్పటి తరం ఆడియన్స్ అభిరుచికి, ఇప్పటి తరం ఆడియన్స్ అభిరుచి ఉన్న తేడా వల్ల అలా అనిపించడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అయితే క్లాసిక్ సినిమాలు ఉంటాయి. అవి మరో ఇరవై ఏళ్ళ తర్వాత చూసిన కూడా ఎంజాయ్ చెయ్యగలం. అలాంటి చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జంధ్యాల గారు.ఆయన చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ చిత్రాలు నేటి తరం దర్శకులకు ఒక నిఘంటువు లాంటిది.
ఇప్పటికీ ఆయన సినిమాలను చూసి కడుపుబ్బా నవ్వించుకోవచ్చు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో ‘అహ నా పెళ్ళంటా’ అనే సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా మరియు రజనీ హీరోయిన్ గా ఈ చిత్రం లో నటించారు.
ఈ సినిమా ద్వారానే కోట శ్రీనివాస రావు నటుడిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. అంతకు ముందే ఆయన పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఈ చిత్రం తోనే ఆయన కెరీర్ మలుపు తిరిగింది. అత్యంత పీనాసి వ్యక్తి గా కొత్త శ్రీనివాస రావు ఇందులో జీవించేసాడు. ఇక అరగుండు అనే పాత్ర ద్వారా, బ్రహ్మానందం కూడా కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది ఈ సినిమా తోనే. తొలిచిత్రం తోనే ఆయన ఈ సినిమా దెబ్బకి స్టార్ కమెడియన్ అయిపోయాడు.
ఇప్పటికి ఈ సినిమాలోని బ్రహ్మానందం సన్నివేశాలను మీమెర్స్ వాడుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో. తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ సినిమాలు తీసి, అద్భుతమైన ఫలితాలను రాబట్టే అతి తక్కువ మంది నిర్మాతలలో ఒకడు ఢీ.రామానాయుడు, ఈ సినిమా కోసం ఆయన కేవలం లక్ష రూపాయిల బడ్జెట్ ని మాత్రమే ఖర్చు చేసారు. కానీ విడుదల తర్వాత ఈ సినిమా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. అంటే పెట్టిన డబ్బులకు వంద రేట్లు లాభాలు అన్నమాట.