మొత్తానికి ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరో చెప్పేసింది..

- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన జీరో సైజ్ బ్యూటీ ఇలియానా.. పెళ్లి కాకుండాతనే తల్లయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా గత ఏప్రిల్ నెలలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనం రేపింది. చాలా మంది అభిమానులు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. అయితే ఆ విషయాన్ని మాత్రం ఇల్లీ బేబీ వెల్లడించలేదు. ఇప్పటికీ అతడు ఎవరు అన్నది తెలియదు. అయితే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఆమె కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉండటంతో అతడే ఆ బిడ్డకు తండ్రి కావచ్చని భావించారు.

ఇలియానా
ఇలియానా

తమ రిలేషన్‌షిప్ పై ఇలియానా కానీ, సెబాస్టియన్ కానీ ఓపెన్ అవలేదు. కానీ తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ ఫొటో ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలో ఫేస్ కనబడకుండా.. కేవలం వాళ్ల చేతులు, వేళ్లకు ఉన్న రింగ్స్ మాత్రమే చూపించింది. తాను తల్లి కావడానికి కారణమైన వ్యక్తి ఇతడేనని హింట్ ఇచ్చింది. అంతేకాదు.. ‘నా రొమాన్స్ చేసే విధానం ఇదే.. కచ్చితంగా అతన్ని ప్రశాంతంగా తిననివ్వను’ అనే క్యాప్షన్‌తో ఆ ఫొటో షేర్ చేసింది. దీంతో ఇతనే ఇలియానా బాయ్‌ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయారు.

కానీ అతనెవరు? అనేది తెలియడం లేదు. అయితే.. బాలీవుడ్ టాక్ ప్రకారం ఇలియానా.. కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్‌తో డేటింగ్‌ చేస్తున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. బహుశా ఇలియానా బిడ్డకు తండ్రి అతడే అయి ఉండవచ్చు.. అని అంటున్నారు. మరి ఇలియానా తన హస్పెండ్‌ను ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి. ఇక సినిమాల కంటే.. ప్రేమ విషయంలోనే ఇలియానా గురించి ఎక్కువగా చర్చించుకునేలా చేసింది. గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమలో పడింది ఇలియానా. అతనితో చాలా కాలం పాటు చెట్టపట్టాలేసుకొని తిరిగింది. కానీ చివరికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here