ట్రోలింగ్ విషయం పక్కన పెట్టేస్తే.. టాలీవుడ్ సినిమా చరిత్రలో మోహన్ బాబుది ప్రత్యేక స్థానం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా, నిర్మాతగా వందల సినిమాలు చేశాడంటే మాములు విషయం కాదు. ఆయన వల్ల ఇండస్ట్రీలోకి పరిచయమైన నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడంటే ఆయన సినిమాలు ఆడటం లేదు కానీ.. 80,90 దశకాల్లో ఆయన సినిమా రిలీజవుతుందే స్టార్ హీరోలు సైతం వాళ్ల సినిమాలను రిలీజ్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవారు.
తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు మోహన్ బాబు. “ఈ ఏడాది మొట్టమొదటిసారిగా శ్రీనివాసుడి దర్శనం అద్భుతంగా జరిగింది. ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, డిసిప్లీన్ ఇంతకుముందు ఎప్పుడూ టీటీడీలో చూడలేదు. టీటీడీ ఈవో ధర్మారెడజడి, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు చక్కగా జరుగుతున్నాయి” అని మోహన్ బాబు తెలిపారు.
సినిమా విషయానికొస్తే రూ. 100 కోట్ల బడ్జెట్ తో భారీ చిత్రాన్ని చేయబోతున్నాం. ఆ వివరాలను ఇప్పుడే చెప్పలేను. త్వరలోనే విష్ణు తెలియజేస్తారు” అని కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. మోహన్ బాబు వంద కోట్ల సినిమాను ప్రకటించి అందరనీ షాక్ కు గురిచేశాడు. మా అధ్యక్షుడు విష్ణు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందట. అంతేకాదు ఈ సినిమా ప్లాట్ ను కూడా మోహన్ బాబు ముందే చెప్పేయడం విశేషం. మోహన్ బాబు యూనివర్సిటీ, అక్కడి స్టూడెంట్స్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు మోహన్ బాబు వెల్లడించాడు. దీంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. వామ్మో మరో సినిమానా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.