HBD Venkatesh : హీరో వెంకటేష్ గురించి కొంత మందికి మాత్రమే తెలిసిన రహస్యాలు..!!

- Advertisement -

HBD Venkatesh : సినియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ గురించి అందరికి తెలుసు.. ప్రముఖ నిర్మాత వారసుడుగా పరిచయమై తన టాలెంట్ తో యంగ్ హీరోలకు రోల్ మోడల్ అయ్యాడు..కెరీయర్ మొదట్లోనే వరుస హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతన్ని ఇంస్ఫ్రెషన్ గా తీసుకొని చాలా మంది నిర్మాతలు తమ వారసులను హీరోగా పరిచయం చేశారు అంటే అతిశయోక్తి కాదు.ఈయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలెదు..కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టినా కూడా, మల్లీ వరుస హిట్ చిత్రాలను అందుకున్నాడు వెంకీ..సినిమాల్లో వచ్చిన విక్టరీ’నే ఇంటిపేరుగా మార్చుకున్నారు వెంకటేష్..ఈయన సినీ జీవితంలోని సక్సెస్ జీవితం గురించి ఇప్పుడు చూద్దాం..

వెంకటేష్ హీరోగా 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమా తో ఆరంగ్రేటం చేశాడు..ఈ సినిమా ఘన విజయాన్ని అందుకున్నాడు.ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన పెద్దగా ఫలితం లేక పోయింది.ఆ తర్వాత దాసరి నారాయణరావు తెరకెక్కించిన బ్రహ్మపుత్రుడు సినిమాతో హిట్ కొట్టాడు.ఆ సినిమాను తన తండ్రే నిర్మించారు.తొలిసారి నటించిన రీమేక్ ‘భారతంలో అర్జునుడు’. హిందీలో విజయం సాధించిన ‘అర్జున్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ఇది పరాజయం పాలైంది. తరువాత హిందీ ‘నసీబ్’ ఆధారంగా వెంకటేష్ ‘త్రిమూర్తులు’ రూపొందింది.తాయ్ మేల్ ఆనై తమిళ్ రిమెక్ గా వచ్చిన రక్తతిలకం’ వెంకటేష్‌కు జయాన్ని అందించింది.

- Advertisement -

ఆ తర్వాత వచ్చిన తమిళ్ రీమెక్ చిత్రం చంటి సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు..ఈసినిమా తర్వాత వచ్చిన చినరాయుడు, సుందరకాండ, కొండపల్లి రాజా, అబ్బాయిగారు సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి..ఆ తర్వాత తమిళ చిత్రం ‘తాయ్ కులమే తాయ్ కులమే’ ఆధారంగా ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు సూపర్ డూపర్ హిట్ అయ్యింది..సూర్యవంశం, రాజా సినిమాలు కూడా రీమేక్స్‌గా తెరకెక్కి ఘనవిజయాలను అందించాయి. అంతేకాదు అతడు నటించిన జెమినీ, సంక్రాంతి, ఈనాడు, నాగవల్లి, బాడీగార్డ్, మసాల, దృశ్యం, గోపాల గోపాల, గురు, నారప్ప, దృశ్యం-2 చిత్రాలు సైతం రీమేక్స్ కావడం విశేషం..అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన తీసిన రీమెక్ చిత్రాలన్నీ కూడా వరుసగా హిట్ అయ్యాయి..

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు వస్తాయి. అయితే, ప్రేమ’ చిత్రం ద్వారా 1988 సంవత్సరం ఉత్తమ నటునిగా నంది అవార్డును అందుకున్నారు.. ధర్మచక్రం ద్వారా 1995 ఉత్తమనటునిగానూ నందిని సొంతం చేసుకున్నారు. ఆపై 1998లో ‘గణేష్’ చిత్రం ద్వారా, 1999లో ‘కలిసుందాం…రా’ సినిమాతోనూ ఉత్తమ నటునిగా నంది అవార్డులను అందుకున్నారు.

2007లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతో కూడా ఉత్తమ నటుడుగా పేరు తెచ్చుకున్నారు..వరుస ఐదు సినిమాలతో అవార్డు తీసుకొని రికార్దును సృష్టించారు.. ఇటీవల యంగ్ హీరోలతో వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలు కూడా మంచి టాక్ ను అందుకున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న హిందీ సినిమా ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

గతంలో వెంకటేష్ అనారీ, తక్దీర్ వాలా.. వంటి హిందీ చిత్రాలలో హీరోగా నటించారు. అలాగే నెట్ ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు… ఇలాగే మరెన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాం.. హ్యాపీ బర్త్ డే వెంకీ..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here