హీరోయిన్లు స్క్రీన్ మీద అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాల్సిందే. ఇక దాంతో పాటు ఫాలోయింగ్ సంపాదించాలంటే అందాలు చూపించాల్సిందే. ఇంత చేసిన పాపులారిటీ వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ సాయి పల్లవి మాత్రం హీరోయిన్లందరికీ భిన్నం. ఎక్స్ పోజింగ్ చేయకుండా నాచురల్ గా ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మంచి పాత్రలు ఎంచుకుంటూ తనకిచ్చిన పాత్రకు ప్రాణం పోస్తుంది ఈ బ్యూటీ. అవసరం లేకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో దర్శనమిచ్చే ఈ రోజుల్లో హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఎక్స్ పోజింగ్ కి అవకాశమే లేదని చెబుతుంది.
నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన సాయి పల్లవి.. ఏ సినిమాలో కూడా ఎక్స్ పోజింగ్ కి అవకాశమే ఇవ్వలేదు. ఈ లక్షణమే ఈ అమ్మడిని మరో స్థాయిలో నిలబెట్టింది. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చినా.. పాత్ర నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పే ధైర్యం సాయి పల్లవికి మాత్రమే సాధ్యం.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన తదుపరి సినిమా విషయమై మాట్లాడుతూ.. “సినిమా అనేది నిర్మాతలను కాపాడాలి.. కానీ నావల్ల కొందరు నిర్మాతలు అప్పలపాలవుతున్నారు.. అది నాకు ఇష్టం లేదు .అయినప్పటికీ వారు మళ్ళీ నాతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. కానీ నేను మాత్రం వారిని ఇబ్బంది పెట్టను. వారిని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాకుండా వేరే మంచి సినిమాల్లో అవకాశాలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తాను” అంటూ క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి.