కృతి శెట్టి ఉప్పెన
సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి తొలి సినిమాతోనే సెన్షేన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. కానీ ఆ తర్వాతే కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ మొదలైంది. ఆమె నటించిన మూడు సినిమాలు గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పట్టాయి.
దీంతో కృతి పనైపోయిందంటూ ప్రచారం మొదలైంది. ఆఫర్లు కూడా రావడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. కానీ నిజానికి ఆమె లైనప్ చూస్తే షాక్ అయిపోతారు. వరస ఫ్లాపులు పడినప్పటికీ కృతి శెట్టి మాత్రం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఈ అమ్మడు నాగచైతన్యకు జోడిగా కస్టడీ
అనే సినిమాలో నటించింది. వెంకట్ ప్రభూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది. ఈ సినిమా ప్లాప్ అయినా..కృతికి మాత్రం ఆఫర్లు బాగానే వస్తున్నాయి.
దర్శకుడు వెంకట్ ప్రభు చేతికి కొత్తగా విజయ్ సినిమా వచ్చింది. సంగీత బాధ్యతలు యువన్ శంకర్ రాజాకే అప్పగించారు. ఇద్దరు కథానాయికలకు చోటుండే ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకుందామనే విధంగా నిర్ణయం జరిగిపోయింది. వరస ఫ్లాపులతో ఉన్న కృతికి అర్జెంట్ గా సూపర్ హిట్ సినిమా అవసరపడుతోంది. విజయ్ లాంటి స్టార్ హీరో చిత్రంలో చేస్తేనే అది సాధ్యమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ పక్కన అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. కస్టడీ సినిమా సమయంలో ఆమె ఫెర్మార్మెన్స్ నచ్చిన వెంకట్ ప్రభు విజయ్ కు స్వయంగా రికమెండ్ చేశారు. వీటితో పాటు మరో రెండు సినిమాలు చేస్తోందిట.