యాంకర్ సుమ.. ఈమె గురించి అసలు ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. స్టార్ యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని ఆమె స్థానాన్ని మరొకరు దక్కించుకోలేని ఎత్తుకు ఎదిగింది.. యాంకరింగ్ అనే పదానికి ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా చెబుతారు. అందుకే ఈమెకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇచ్చి షో చేయిస్తారు. ఒకవైపు బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూనే మరో వైపు ఈమె సినిమా ఈవెంట్స్ ను కూడా చేస్తుంటుంది.
తాజాగా సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో ఈమె ఫుడ్ పికిల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ వీడియోని చేశారు. ఇందులో తన భర్త రాజీవ్ కనకాల కూడా ఉన్నారు.అయితే సుమ ప్రమోట్ చేసే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇది వరకు చాలామంది ఉపయోగించారని పెద్దగా అవి టేస్ట్ లేవు నాసిరకం ఫుడ్ అంటూ పెద్ద ఎత్తున ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలోనే ఈమెపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.. డబ్బు కోసం ఇలాంటివి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు.. అవి ఇంటికి వచ్చే లోపే పాడై పోతున్నాయని.. ఇప్పటికే చాలా సంపాదించినా మీరు వీటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
సుమ పర్సనల్ లైఫ్ మాత్రం డిస్టర్బ్ కాకుండా చూసుకుంటూ.. భర్త, పిల్లలతో ఎంతో హాయిగా సాగుతుంది. అందుకే వీరిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తాది. కానీ వీళ్ళ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయట. సినిమా ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్స్ పాత్రలు చేసి ఐటమ్ గర్ల్ గా ప్రసిద్ధి చెందిన ఓ హీరోయిన్ రాజీవ్ కనకాలతోను సినిమాలు చేసింది. అప్పటి నుంచి అతనితో ఆమె చెట్టాపట్టా వేసుకుని తిరిగి, వాళ్ళయిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని వార్తలు వచ్చేంతగా దగ్గరయింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మాట్లాడుకునేవారు. అయితే దీనికి సుమ కొంత బాధపడినా రాజీవ్ మీద నాకు నమ్మకం ఉంది యాంకర్ సుమ అని చెప్పి తన భర్తను తాను సమర్ధించుకుంది.