ఆ హీరోయిన్ తో చరణ్ రొమాన్స్ చెయ్యడం తట్టుకోలేకపోయాను అంటూ ఉపాసన షాకింగ్ కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి రామ్ చరణ్ – ఉపాసన జంట. వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని పదేళ్లు దాటినప్పటికీ, ప్రారంభం లో ఎంత అన్యోయంగా ఉండేవాళ్ళో ఇప్పటికీ అలాగే ఉన్నారు. వీళ్ళతో పాటు పెళ్లి చేసుకున్న కొన్ని జంటలు మనస్పర్థలు వచ్చి చిన్న చిన్న వాటికే విడాకులు తీసుకున్నారు.

ఉపాసన
ఉపాసన

కానీ రామ్ చరణ్ – ఉపాసన మధ్య గొడవలు రాలేదని ఎవ్వరూ చెప్పలేదు, దాంపత్య జీవితం లో అవన్నీ సర్వసాధారణం, ఎన్ని సమస్యలు వచ్చినా తమ మధ్యనే దాచుకొని, పరిష్కరించుకొని విజయవంతంగా దాంపత్య జీవితం కొనసాగిస్తూ ఎంతో మంది దంపతులకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఉపాసన గర్భవతి అయ్యింది, త్వరలోనే రామ్ చరణ్ ఒక పాపకి కి కానీ, బాబు కి కానీ తండ్రి కాబోతున్నాడు. సెప్టెంబర్ నెలలో డెలివరీ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇది ఇలా ఉండగా ఉపాసన సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమె ప్రత్యేకంగా ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో హీరోయిన్స్ తో రామ్ చరణ్ రొమాన్స్ చేసే విషయంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -

ఆమె మాట్లాడుతూ ‘ సినిమా హీరో అన్న తర్వాత అన్నీ చెయ్యాలి తప్పదు, సందర్భానుసారంగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అవసరం లేకపోయినా కూడా మితిమీరిన రొమాన్స్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం లో కాజల్ అగర్వాల్ చరణ్ తో రొమాన్స్ చెయ్యడం నాకు కాస్త ఇబ్బంది కలిగించింది. అవసరం లేకపోయినా డైరెక్టర్ ఇలాంటి సన్నివేశాలు ఎందుకు పెట్టాడు అంటూ రామ్ చరణ్ తో గొడవలు కూడా వేసుకున్నాను. అప్పటి నుండి చరణ్ రొమాంటిక్ సన్నివేశాలకు దూరం గా ఉంటూ వచ్చాడు’ అని చెప్పుకొచ్చింది ఉపాసన.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here