యువ హీరోలకు దీటుగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ తన 108వ చిత్రాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటం సాంగ్ ఉందని, ఆ పాటకోసం దర్శకుడు అనిల్ మిల్కీబ్యూటీ తమన్నాను ఒప్పించాడని కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై తమన్నా మండిపడింది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయడానికి మిల్కీ బ్యూటీ ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ ఐటెం సాంగ్ చేయడానికి తమన్నాకు దాదాపు రూ. కోటి రూపాయల పారితోషకం కూడా డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ విషయమై తమన్నా ట్వీట్ చేస్తూ.. నేను అనిల్ రావిపూడితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తాను.ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించాను. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి తనను ఎవరు సంప్రదించలేదని తమన్నా క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ వస్తే తప్పకుండా చేస్తానంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో ఐటెం సాంగ్ చేయడం లేదనే విషయమై క్లారిటీ వచ్చింది.
మొత్తంగా బాలయ్య, తమన్నా కాంబినేషన్లో సినిమా చూాడాలనకునే అభిమానులకు ఒకింత నిరాశ కలిగించే అంశమనే చెప్పాలి. ఇప్పటికే ఉగాది కానుకగా విడుదల చేసిన బాలయ్య లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్య గెటప్, కోర మీసంతో ఉన్న లుక్కు అభిమానులు ఫిదా అవతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ. 80 కోట్ల వరకు అమ్ముడు పోయినట్టు సమాచారం. మరోవైపు డిజిటల్ హక్కులు రూ. 40 కోట్లకు ప్రైమ్ ఐదు భాషలకు సంబంధించిన డీల్ పూర్తైయినట్టు సమాచారం.