బాలకృష్ణతో అన్నిచేయాలనేసరికి రేటు పెంచిన తమన్నా

- Advertisement -

స్టార్ హీరోయిన్ తమన్నా వరుసపెట్టి బడా హీరోలతో నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ హుషారెత్తిస్తోంది. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ తో స్టెప్పేసిన ఈ బ్యూటీ.. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబుతో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు సీనియర్ హీరో బాలయ్య బాబుతో స్టెప్పేసేందుకు రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి- బాలకృష్ణ కాంబోలో రాబోతున్న NBK 108 సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుందట. డైరెక్టర్ అనిల్ రావిపూడితో తమన్నాకు మంచి రిలేషన్‌ ఉన్న కారణంగా ఈ సినిమాలో ఆమెతోనే స్పెషల్ సాంగ్ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారట.

తమన్నా
తమన్నా

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటెం సాంగ్ ఉండబోతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం తాజాగా చిత్ర బృందం మిల్కీ బ్యూటీ తమన్నను సంప్రదించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య తో ఆడి పాడేందుకు తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండగా తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాలోనైనా ఒక పాటను రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఈ రెండు మూడు రోజుల కోసం తమన్న ఏకంగా 1.50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Tamanna Balakrishna

దీంతో తమన్నా రెమ్యూనరేషన్ డిమాండ్ ను చూసిన మేకర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారట.అయినప్పటికీ తమన్న కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకున్న చిత్ర బృందం తమన్నా ఎంత అడిగినా ఇచ్చేందుకు ఒప్పుకున్నారట. అంతే కదా త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లోకి ఐటమ్ సాంగ్ కూడా చిత్రీకరించబోతున్నారు.

- Advertisement -

అంతేకాదు ఈ పాట కోసం ఒక స్పెషల్ సెట్ ను సైతం ఏర్పాటు చేస్తున్నారట. ఇక ఈ సినిమా దసరా కానుకగా భారీ అంచనాలతో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఫన్ అండ్ ఎంటర్ టైనింగ్ నేపథ్యంలో ఎఫ్3 సినిమాతో ఫన్ కిక్కిచిన అనిల్ రావిపూడి.. ఈ సారి బాలయ్య బాబుతో వినూత్న ప్రయోగం చేస్తున్నారట. విలక్షణ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here