యంగ్ లేడీస్ సోషల్ మీడియా ఖాతాల్లో ఎప్పటికప్పుడు కనిపిస్తున్న ఫోటో షూట్స్ ఆన్ లైన్ మాద్యమాలను షేక్ చేస్తున్నాయి. ఈ బాటలోనే తాజాగా యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా (Rashi Khanna) యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది. సినిమాల పరంగా దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి అడుగులేస్తూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సరిగ్గా వాడేస్తోంది ఈ అందాల భామ. ఇంత అందగత్తె ఓ సమస్యతో బాధపడుతోందిట.
రాశి ఖన్నా(Raashi Khanna) పీసీఓడీ సమస్యతో ఇబ్బంది పడుతోందిట. ఈ సమస్య కారణంగా ఆమె కెరీర్ ఆరంభంలో చాలా బరువు పెరిగిందని చెప్పుకుంటుంటారు. దాంతో చాలామంది ఆమెను చాలామంది లావుగా ఉన్నావంటూ వెక్కిరించారుట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా స్వయంగా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. సౌత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనను గ్యాస్ ట్యాంకర్ అంటూ రకరకాల పేర్లతో ఎగతాలి చేశారని.. తనకు పీసీఓడీ సమస్య ఉందని తెలియకుండా బాడీ షేమింగ్ కామెంట్స్ తో వేధించారని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. అయితే వాళ్లెవ్వరో ఏదో అన్నారని తాను బరువు తగ్గలేదట. తన కెరీర్ కోసమే బరువు తగ్గినట్లు చెప్పింది. మొదట్లో చాలా లావుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు సన్నగా నాజుగ్గా తయారైన సంగతి తెలిసిందే.
గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత క్రేజీ ఆఫర్స్ కొట్టేసింది. సుప్రీమ్, బెంగాల్ టైగర్, జిల్, శివమ్ఎం వెంక్యమామ, హైపర్, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. దీంతో స్టార్ స్టేటస్ వరించనప్పటికీ.. అమ్మడి అందాల తడికి అంతా కనెక్ట్ అయ్యారు. దీంతో రాశీ ఖన్నా పాపులారిటీ పెరిగిపోయింది. తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పర్చుకుంది ఈ యంగ్ హీరోయిన్.రాశీ ఖన్నా అనగానే ప్రతి ఒక్కరికీ బొద్దుగుమ్మనే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు తన లుక్ పూర్తిగా మార్చేసుకొని ఆశ్చర్యపరుస్తోంది రాశీ. రెగ్యులర్ వర్కవుట్స్ చేస్తూ తన రూపాన్ని మొత్తం మార్చుకుంది ఈ బ్యూటీ.