తెలుగు హీరోయిన్ చార్మి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అడపాదడపా సినిమాల్లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. అయితే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు నిర్మాతగా సినిమాలను తెరకేక్కిస్తుంది.. ఈమె నిర్మాతగా చేసిన ఇష్మార్ట్ శంకర్ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత లైగర్ సినిమాను తెరకేక్కించారు.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అందుకుంది.. అయితే సినిమా వల్ల బాగా నష్టపోయమని ఎగ్జిబిటర్స్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. లైగర్ తో నిండా మునిగిన మాకు నష్టాల్లో కొంత తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు..
చార్మి, పూరి జగన్నాథ్ నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు.. ఇక నిన్న చార్మి పుట్టినరోజు సందర్బంగా ఒక ఆసక్తికర పోస్ట్ ను పెట్టింది..చేతిలో వోడ్కా గ్లాస్ పట్టుకొని ఫోజిచ్చిన ఛార్మి లైఫ్ ని సీక్రెట్ అనుభవించాలని కొటేషన్ పెట్టింది..నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి, నిజమైన ప్రేమను పొందండి, ఆనందంగా జీవించండి… ఇవన్నీ రహస్యంగా చేయండి. లేదంటే ఈ జనాలు మీ సంతోషాలు నాశనం చేస్తారంటూ, ఛార్మి ఓ నోట్ చేశారు. ఛార్మి బర్త్ డే పోస్ట్ వైరల్ అవుతుంది. లైగర్ ప్లాప్ తో ఛార్మి-పూరి కెరీర్ మరలా క్రిందకు పడింది. అయితే రామ్ పోతినేనితో కొత్త మూవీ ప్రకటించారు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది..
ఇకపోతే పూరి జగన్నాధ్ కి దగ్గరయ్యాక ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు. పూరి, ఛార్మి ఈ సంస్థ నిర్మాణ భాగస్వాములు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం జ్యోతిలక్ష్మీ. అరడజనుకు పైగా చిత్రాలు చేశారు. ఇస్మార్ట్ శంకర్ మాత్రమే విజయం సాధించింది. లైగర్ విజయం సాధిస్తే ఛార్మి కథ వేరుగా ఉండేది… ప్రస్తుతం వీరిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై చార్మి ఎలా స్పందిస్తారో చూడాలి..