80లలో శృంగార తారగా సౌత్ ఇండియాను ఏలారు సిల్క్ స్మిత. ఈ పల్లెటూరి అమ్మాయి సౌత్ ఇండియాను షేక్ చేశారు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి కాగా అత్తింటివారి వేధింపులు తాళలేక చెన్నై పారిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. తెలిసినవారు లేరు, అక్షరం ముక్కరాదు… కేవలం బ్రతకాలన్న మొండితనం ఆమెను సినిమా వైపు అడుగులు వేసేలా చేసింది. ఒక్కో విషయం తెలుసుకుంటూ, నేర్చుకుంటూ స్టార్ అయ్యారు. వందల చిత్రాల్లో నటించారు. ఆకాశంలోకి రివ్వున దూసుకెళ్లిన తారాజువ్వలా వెలుగులు చిమ్మి అంతలోనే కనుమరుగైంది.
నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో అభిమానులను అలరించిన ఈ బ్యూటీ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించిన విషయం తెలిసిందే. సిల్క్ స్మిత ఆత్మహత్య సినీ ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చింది. 200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత హఠాన్మరణం అనేకమంది సినీ ప్రముఖులకు షాక్ ఇచ్చింది. అనేక సినిమాలలో సిల్క్ ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చి పెట్టాయి. తెలుగులో “బావలు సయ్యా, మరదలు సయ్యా” పాట ఇప్పటికే హాట్ హాట్ సాంగ్ అనే చెప్పాలి.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో.. సిల్క్ స్మిత చివరిసారిగా రాసిన లెటర్ బాగా చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ లెటర్ లో సిల్క్ స్మిత ఏం రాసిందంటే.. ఆమె ఏడు సంవత్సరాల వయసు నుంచి ప్రతి రోజు కష్టాన్ని చూసి పెరిగిందంట. ఆమెను ప్రేమించే వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండేవారు కాదంట. అందరూ తన కష్టాన్ని దోచుకునే వారి తప్ప తనను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదంట. ప్రతి ఒక్కరు తనని మోసం చేసేవారని.. రాధాకృష్ణ, రాము వీళ్ళిద్దరూ సిల్క్ ని చాలా దారుణంగా మోసం చేశారు అంట.
దేవుడు అనేవాడు ఉంటే వాళ్ళిద్దర్నీ ఖచ్చితంగా శిక్షిస్తాడని ఆమె తెలిపింది. ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నా జీవితంలో అడుగుపెట్టి మంచి లైఫ్ ఇస్తానని చెప్పి.. తిరిగి నేను సంపాదించిన ఆస్తులు అన్ని మొత్తం లాక్కొని చివరికి మోసం చేశాడు అని చెప్పింది. ఆ వ్యక్తి ప్రతీరోజు పెట్టె టార్చర్ భరించలేకపోతున్నాని చెప్పింది. అయితే సిల్క్ స్మిత రాసిన లెటర్లో.. తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకోబోతున్న విషయం టైం రాయలేదు. రాధాకృష్ణ పేరు రావడంతో ఆమె చనిపోయాక అతని పోలీసులు అరెస్ట్ చేయడం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. జీవితంలో ఏడు సంవత్సరాల వయసు నుంచి ఒకటి కష్టాన్ని చూడడం అయితే వయసు పెరిగే కొద్దీ కనీసం ప్రేమించే మనుషులు కూడా ఆమెకి లేరని.. ఈ రెండు విషయాలు చదివి అందరూ కన్నీరు పెడుతున్నారు.