యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి చిత్రానికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా ఆరోజుల్లో సృష్టించిన మాస్ ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఈ సినిమా అప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ వయస్సు కేవలం 19 ఏళ్ళు మాత్రమే, ఇండస్ట్రీ కి వచ్చి కూడా కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది.
అంత చిన్న వయస్సు లో అంత తక్కువ సమయం లో ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ని ఢీ కొట్టే స్టార్ స్టేటస్ ని మాస్ ఆడియన్స్ లో సంపాదించాడు. అప్పట్లో 25 కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ ని రాబట్టిన ఈ సినిమా, 50 కి పైగా కేంద్రాలలో 175 రోజులను పూర్తి చేసుకుంది. అలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20 వ తారీఖున రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి,ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేవు కానీ, ఓవర్సీస్ లో మాత్రం మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా జపాన్ లో ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తుంది. అక్కడ ఈ సినిమాకి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1 మిలియన్ జపనీస్ డాలర్స్ ని రాబట్టిందట.
అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 5 లక్షల రూపాయిలు అన్నమాట. సినిమా విడుదల సమయానికి అది 10 లక్షల రూపాయలకు చేరుకుంటుందని, ఇలాంటి అద్భుతమైన ఫీట్ కేవలం ఎన్టీఆర్ కి తప్ప ఎవరికీ సాధ్యపడదు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ కి మొదటి నుండి జపాన్ లో మంచి క్రేజ్ ఉంది, #RRR చిత్రం తో ఆ క్రేజ్ రెట్టింపు అయ్యింది, దాని ప్రభావమే ఇదంతా అని అంటున్నారు విశ్లేషకులు.