జగపతి బాబు తండ్రి వీబీ విజయేంద్ర ప్రసాద్ ఒక గొప్ప నిర్మాత మరియు దర్శకుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన ఎన్టీఆర్ , ANR , కృష్ణ , శోభన్ బాబు ఇలా ఎంతో మంది లెజెండరీ హీరోలతో పని చేసాడు. ముఖ్యం ANR కి సొంత బ్యానర్ లాగ ఉండేది ఆరోజుల్లో జగపతి ఆర్ట్స్. ఆయనని హీరో గా పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. ఒకానొక దశలో ఆయన నాగేశ్వర రావు తో నిర్మించబోయే ‘దసరా బుల్లోడు’ చిత్రానికి తాను ముందుగా అనుకున్న దర్శకుడు డేట్స్ ఖాళీ లేకపోవడం తో చాలా ఇబ్బంది పడ్డాడు.
ఎవరిని దర్శకుడిగా తీసుకుందామా అని అనుకుంటున్న సమయం లో నాగేశ్వర రావు నువ్వే ఈ చిత్రానికి దర్శకత్వం వహించు అన్నాడు, అప్పుడు ఆయన ముందుగా ఒప్పుకోలేదు, దాంతో నాగేశ్వర రావు నువ్వు దత్సకత్వం వహించకపోతే నేను ఈ సినిమా చెయ్యను అని పేచీ పెట్టడం తో ‘దసరా బుల్లోడు’ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఆ చిత్రం ఆరోజుల్లో ఇండస్ట్రీ హిట్ అయ్యింది, నాగేశ్వర రావు ఇమేజి ని పదింతలు ఎక్కువ అయ్యేలా చేసింది.ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అదే చిత్రం పేరు తో తన జీవితం లో హీరోలతో తనకి ఉన్న మధురమైన అనుభూతులను పంచుకుంటూ ‘దసరా బుల్లోడు’ అని ఒక పుస్తకం రాసాడు. ఈ పుస్తకం లో తాను పని చేసిన హీరోలందరి గురించి రాసాడు కానీ, నందమూరి బాలకృష్ణ గురించి మాత్రం రాయలేదు. ఆయనతో గతం లో ‘బంగారు బుల్లోడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించాడు.
ఈ సినిమా షూటింగ్ సమయం లో రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు బాలకృష్ణ కి మధ్య గొడవలు జరిగాయట.అందుకే ఆయన బాలకృష్ణ మీద కోపం తోనే ఆ పుస్తకం లో ఆయన పేరు ని ప్రస్తావించలేదని అప్పట్లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. బంగారు బుల్లోడు సినిమా షూటింగ్ ఒక పల్లెటూరిలో జరుగుతున్న సమయం లో ఒక షెడ్యూల్ లో పూర్తి కావాల్సిన సినిమా నాలుగు షెడ్యూల్స్ సమయం తీసుకుంది. దీని వల్ల బాలయ్య కి నాకు మధ్య వివాదం జరిగింది, చాలా సంవత్సరాలు మాట్లాడుకోలేదు అంటూ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పట్లో చెప్పుకొచ్చారు.