సీనియర్ నటుడు నరేష్ గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. కొందరు ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటుంటే మరికొందరు కాదు కాదు ఈ జంట డేటింగ్ లోనే ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు .. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఈ ముదురు జంట మాత్రం మా ఇష్టం అంటూ రెచ్చిపోతున్నారు.. సినిమా పేరు చెప్పుకొని తెగ ఎంజాయ్ చేస్తున్నారు..’మళ్ళీ పెళ్లి’తో తమ లవ్ స్టోరీనే వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు నరేష్-పవిత్ర. మే 26న ఈ సినిమా విడుదల కాబోతుండగా.. ప్రమోషన్స్ లో జోరును పెంచారు.. అందులో భాగంగా ముద్దులతో రెచ్చిపోయారు..
ఈ క్రమంలోనే బుల్లితెరలోని పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రొగ్రామ్‌లో హోస్ట్ రిలేషన్షిప్ స్టేటస్ అడగ్గా స్పందించిన నరేష్.. ‘ఆకాశం ఊడిపడినా.. భూమి బద్ధలైనా.. మేము కలిసే ఉంటాం’ అంటూ పవిత్రకు నుదుటి మీద ముద్దుపెట్టాడు. దీంతో పవిత్ర కూడా నరేష్‌ను కిస్ చేసింది.
కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. నరేష్ లేట్ వయసులో ఘాటు ప్రేమను అనుభవిస్తున్న అదృష్టవంతుడని రకరకాల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.. ఇక తాజాగా ఈ జంట ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్త్స్ సెన్స్
షోకి వచ్చారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రని ముద్దుగా ఏమని పిలుచుకుంటారో చెప్పారు నరేష్. ముద్దుగా తనని అమ్ములు
అని పిలుచుకుంటారట. ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము
అని, ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో తెలుసా.. అని సస్పెన్స్ పెట్టి వద్దులే
అని వదిలేశాడు నరేష్..
ప్రస్తుతం మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటని ఓంకార్ ప్రశ్నించగా, ఆకాశం మీద పడినా, భూమి బద్దలైనా, మేం కలిసి ఉంటామని స్పష్టం చేశాడు నరేష్. ఈ సందర్భంగా నరేష్ ఉబ్బితబ్బిబ్బయ్యింది. అనంతరం ఇద్దరు కలసి డాన్సులు చేశారు. స్టేజ్‌పైనే రచ్చ రచ్చ చేశారు.
అంతేకాదు ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకున్నారు. ఓ రకంగా ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక నేటిజన్స్ కూడా వదలకుండా కామెంట్లు పెడుతున్నారు.. బాబోయ్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఇక మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది.. ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..