యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ కోసం అభిమానులతో పాటుగా ఇండియా లో ప్రతీ సినీ ప్రేక్షకుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీరాముడి చరిత్రను ఎన్నిసార్లు చూడడానికైనా ఇష్టపడే మన భారతీయులు, భారీ బడ్జెట్ తో ప్రభాస్ లాంటి స్టార్ హీరో ని పెట్టి తీస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణ గా నిల్చింది ‘ఆదిపురుష్’ ట్రైలర్.
ఈ ట్రైలర్ కి తెలుగుతో పాటుగా , హిందీ , తమిళం,కన్నడం మరియు మలయాళం బాషలలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీ లో రెస్పాన్స్ అదిరిపోతోంది అని ముందుగా ఊహించిందే.ఎందుకంటే అక్కడి ఆడియన్స్ కి శ్రీ రాముడిని మించి దేవుడు లేదు, ఆయన పేరు విన్నా రూపం చూసిన పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు,కానీ కన్నడ మరియు మలయాళం బాషలలో కూడా ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.
ఏ భాషలో ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒకసారి పరిశీలిస్తే, హిందీ లో ఈ సినిమా ట్రైలర్ కి నాలుగు రోజుల్లో అక్షరాలా 60 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది బాలీవుడ్ లోనే ఫాస్టెస్ట్ రికార్డు అని అంటున్నారు. అలాగే తెలుగు లో రెండు యూట్యూబ్ చానెల్స్ లో ఈ ట్రైలర్ ని విడుదల చేసారు. ఒక ఛానల్ లో 22 మిలియన్ వ్యూస్ వస్తే, మరొక ఛానల్ లో 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
కేవలం ఈ రెండు బాషల నుండే 92 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత కన్నడ లో 2.6 మిలియన్ వ్యూస్, మలయాళం లో 3.4 మిలియన్ వ్యూస్, తమిళం లో 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా అన్నీ భాషలకు కలిపి సుమారుగా 108 మిలియన్ వ్యూస్ ఇప్పటి వరకు వచ్చాయట. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ రేంజ్ వ్యూస్ రావడం అనేది ఇది వరకు ఎప్పుడూ జరగలేదు, ఒక్క ఆదిపురుష్ విషయం లోనే జరిగింది అని అంటున్నారు విశ్లేషకులు.