యాంకర్ అనసూయ ( Anchor Anasuya ) అంటే జబర్దస్త్ అంటారు..అంతలా ఆ షో ద్వారా పాపులర్ అయ్యింది..గతంలో చేసిన షోల తో మంచి రెమ్యునరేషన్ తీసుకున్నా..కానీ జబర్దస్త్ నాకు కొత్త జన్మను ఇచ్చింది అని చాలా సందర్భాల్లో చెప్పింది..అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ షోను వదిలేసింది..ఆ సినిమాలు అనుకున్న హిట్ ను ఇవ్వలేక పోయాయి..దాంతొ అను పరిస్థితి దారుణంగా మారిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు..మళ్ళీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తుందని టాక్..
ప్రస్తుతం ఈ యాంకరమ్మ ఏం చేస్తుంది అంటే సమాధానం ఆమె అభిమానుల వద్ద లేదు. సినిమాల్లో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి అంటూ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసిన అనసూయ ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తోంది. ఆ మధ్య తనకు మంచి పరిచయం ఉన్న రోజా ద్వారా జబర్దస్త్ కార్యక్రమంలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు అనసూయ చాలా ప్రయత్నాలు చేసింది అనే పుకార్లు షికార్లు చేశాయి. స్టార్ మా కార్యక్రమాల్లో యాంకర్ గా మరియు జడ్జ్ గా వ్యవహరించేందుకు, జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసిన అనసూయ ఇప్పుడు అక్కడ కూడా పని లేక దిక్కులు చూస్తుంది.
పైగా సినిమాల్లో కూడా ఆఫర్స్ రావడం లేదు. ఇటీవల వరుసగా వచ్చిన సినిమాలు ఆమెకు నిరాశ మిగిల్చాయి. హీరోయిన్ గా నటించలేదు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు.. ఐటెం సాంగ్స్ వరసగా రావడం లేదు. అయినా కూడా సినిమాల్లో ఆఫర్స్ అంటూ జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పి చాలా పెద్ద తప్పు చేసింది అంటూ ఆమె సన్నిహితులు మరియు అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అనసూయ తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతుంది తప్పితే షూటింగ్స్ కి ఎక్కువ హాజరు కావడంలేదని టాక్ వినిపిస్తుంది.
ఇంత తక్కువ సమయంలో ఇలా అవుతుందని ఏ ఒక్కరు ఊహించలేదు. ఆమె కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు. ఒకప్పుడు వరుసగా కార్యక్రమాలు చేస్తూ బిజీబిజీగా షూట్స్ తో ఉన్న అనసూయ ఇప్పుడు కొడుకులతో సమయాన్ని గడుపుతుంది. ఇంటి వద్ద ఎక్కువ సమయం ఉంటూ షూట్ లో తక్కువ సమయం ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.. ఆమె మళ్ళీ వరుస సినిమాలతో ,షో లతో బిజీగా ఉంటుందేమో చూడాలి.. ఏ మాటకు ఆ మాట చెప్పాలి 37 ఏళ్ల వచ్చిన అందం మరింత పెరుగుతుంది. ఇక అమ్మడు డ్రెస్సింగ్ కూడా కుర్రాళ్ళ నుంచి స్టార్ హీరోల వరకూ అందరినీ ఆకర్షిస్తుంది..