టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. అయితే ఈ ఏడాది ఈ బ్యూటీకి కాస్త అచ్చిరాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం పూజా Pooja Hegde నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయినా ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. హిట్స్ లేకపోయినా.. వరుస ఫ్లాప్‌లతో ఉన్నా.. ఈ బుట్టబొమ్మకు ఆఫర్ల వర్షం కురుస్తూనే ఉంది. కేవలం టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్‌లలోనూ వరుస అవకాశాలొస్తున్నాయి ఈ భామకు.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న పూజ మనసు ఇప్పుడు బాలీవుడ్‌పై పడింది. ముంబయి ప్రేక్షకులను అలరించడానికి ఈ బ్యూటీ తెగ ఆరాటపడుతోంది. ఈ అమ్మడు ఆరాటం చూసిన బీ టౌన్ ఫిల్మ్ మేకర్స్ ఆమెకు వరుస అవకాశాలిస్తున్నారు. క్రేజీ ఆఫర్స్‌తో అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. కానీ ఎన్ని సినిమాలు చేసినా బీ టౌన్లో నెక్స్ట్ లెవెల్‌కు చేరుకోలేకబోతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కామియో రోల్లో నటిస్తున్నారు.
ఇప్పటి వరకు పూజా హెగ్డే పర్సనల్ లైఫ్.. అదేనండి తన రిలేషన్షిప్ గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. ఈ బ్యూటీ తన ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉందని చెప్పుకుంటూ వచ్చింది కూడా. కానీ రీసెంట్గా బాలీవుడ్లో పూజాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరోతో పూజా రిలేషన్షిప్లో ఉందనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
వివాదాస్పద ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు మూవీ రివ్యూలు ఇస్తూ కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఫేమస్ అయ్యాడు. తాజాగా ఉమైర్ సంధు పూజా హెగ్డే గురించి గురించి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. పూజా హెగ్డే, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మధ్య ప్రస్తుతం లవ్ అఫైర్ కొనసాగుతున్నట్లు ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. “బీ టౌన్లో కొత్త ప్రేమ మొదలైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో ‘కిసీకా భాయ్ కిసీ కి జాన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్లో మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేసింది.” అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.
ఉమైర్ కామెంట్స్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు చేసే కామెంట్స్ అన్ని ఫేక్ అని కొట్టి పారేస్తుంటే.. మరికొందరు మాత్రం అందులో నిజం లేకపోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్లో రాణించేందుకు పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ అండదండలు కోరుకుంటోందని.. అందుకే అతడితో క్లోజ్ గా ఉంటోంది అని అంటున్నారు.
ఇటీవల పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా సల్మాన్ ఖాన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సెట్స్ లోనే పూజా హెగ్డే బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్‌కు ప్రేమ వ్యవహారాలు కొత్తేమీ కాదు. కానీ పూజా హెగ్డే ఈ సీనియర్ హీరోతో నిజంగా రిలేషన్లో ఉందా అనేది ప్రశ్న.