యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలలో ఒకటి ‘ఆది పురుష్’. రామాయణం మీద ఇదివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ సరికొత్త టెక్నాలజీ తో , భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు.అందుకే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కించారు.
ఇండియా లో ఈ టెక్నాలజీ వాడడం ఇదే తొలిసారి. అయితే టీజర్ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్ వర్క్ సరిగా రాలేదంటూ సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. అందుకే సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 16 వ తేదికి వాయిదా వేసి, గ్రాఫిక్స్ పై మరింత రీ వర్క్ చేసారు. ఇప్పుడు ఔట్పుట్ బాగా వచ్చింది అనే నమ్మకం రావడం తో నేడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ లోని విశేషాల గురించి కాసేపు చర్చించుకుందాం.
ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ లో విజువల్స్ చూసినప్పుడు కలిగిన అనుభూతి ఎలా ఉందంటే, మనం రామాయణం లోకి అడుగుపెట్టామా, ఆ ప్రపంచం లో శ్రీముడితో కలిసి నడుస్తున్నామా అనేంత అనుభూతి కలిగింది.అంత అద్భుతంగా ఉంది ఈ సినిమా ట్రైలర్, టీజర్ విడుదలైనప్పుడు కార్టూన్ బొమ్మలు లాగ ఉంది అంటూ తెగ కామెడీ చేసారు, కానీ ట్రైలర్ విడుదల తర్వాత ఆ నెగటివ్ కామెంట్స్ ఏవి గుర్తుకు రావు,అప్పట్లో విమర్శించింది వాళ్ళే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.
అంత అద్భుతంగా ఉంది విజువల్ ఎఫెక్ట్స్, రామాయణం లో ఉండే వానర సైన్యం మొత్తాన్ని, మోషన్ కాప్చర్ టెక్నాలజీ ని ఉపయోగించి చేసారు, అవి చాల్ న్యాచురల్ గా ఉన్నాయి. అయితే సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ మరియు లుక్స్ బాలేదు , అదొక్కటే మైనస్. అయితే వెండితెర మీద చూసినప్పుడు మాత్రం అలాంటి అనుభూతి కలగదు అని అంటున్నారు, చూడాలి మరి. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నా, ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు,మరి అది నిజం అవుతుందో లేదో తెలియాలంటే జూన్ 16 వరకు వేచి చూడాలి, ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని మీరు కూడా క్రింద చూసి ఎంజాయ్ చెయ్యండి.