మొత్తానికి నాగచైతన్యతో ఉన్న బంధాన్ని అందరిలో బయటపెట్టిన శోభిత

- Advertisement -

సెలబ్రెటీల ప్రొఫెషనల్ జీవితంతో పాటు పర్సనల్ విషయాలను కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు సినీ ప్రేక్షకులు. ఈ నేపథ్యంలోనే తారల లవ్, డేటింగ్ ,పెళ్లి విడాకులు వంటి విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇద్దరు సెలబ్రిటీలు కలిసి బయటకు వస్తే చాలు వారిద్దరి మధ్య ఉన్నది స్నేహమా ప్రేమ అన్న కోణంలో ఆలోచిస్తారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే ఈ కాకిని నాగచైతన్య శోభిత దూళిపాల డేటింగ్ రూమర్స్ ఎప్పటినుండో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఒకసారి లండన్ వెకేషన్ లో మరోసారి రెస్టారెంట్లో వీరిద్దరూ కలిసి జంటగా కనిపించారు. దీంతో వీళ్లపై రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై శోభిత మాట్లాడింది.

నాగచైతన్యతో
నాగచైతన్యతో

నాపై అంత ఎక్కువగా రూమర్స్‌ రాలేదనే అనుకుంటున్నా. అదృష్టవశాత్తు ఇప్పటివరకూ మంచి చిత్రాల్లో నటించాను. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. అలాంటి నాకు మణిరత్నం వంటి గొప్ప దర్శకుడి సినిమాలో రెహమాన్‌ మ్యూజిక్‌ కంపోజిషన్‌లో నాలుగు పాటలకు డ్యాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. నా వరకూ అదొక అద్భుతమైన అనుభవం. ఇన్ని ప్రత్యేకమైన విశేషాలు ఉన్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తెలిసీ తెలియక ఏదో మాట్లాడినంత మాత్రాన దాన్ని పెద్దగా పట్టించుకుని బాధ పడాల్సిన అవసరం లేదు. నాకు సంబంధం లేని దాని గురించి.. నా తప్పు లేకుండా వార్తలు వచ్చినప్పుడు దానిపై వెంటనే వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ జీవితంపై నువ్వు ఫోకస్‌ పెట్టి.. ముందుకు సాగిపోవాలి. వేరే వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్పింది.

naga chaitanya Sobhita Dhulipala

దీంతో శోభిత ధూళిపాల చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ సంబంధించిన డేటింగ్ రూమర్ ఎప్పటినుండో వస్తున్నాయి. అయినప్పటికీ ఇంత కాలంగా వీరిద్దరికీ సంబంధించిన రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ శోభితా కానీ అటు నాగ చైతన్య కానీ ఎప్పుడూ స్పందించింది లేదు. దీంతో ఇంత కాలానికి మొదటిసారిగా శోభిత ఈ వ్యవహారంపై స్పందించడంతో ఈ వార్త కాస్త హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here