విజయ్ – రష్మిక విడిపోవడానికి కూడా సమంతనే కారణమా..

- Advertisement -

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో రష్మిక నటించిన తమిళ సినిమా వరిసు, హిందీ సినిమా మిషన్ మజ్ను సినిమాలు రిలీజ్ కి రెడీ అవ్వనున్నాయి. దీంతో రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. అయితే ఈ నేషనల్ క్రష్ కు సమంత అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తాజాగా రష్మిక సమంత కోసం ఓ త్యాగం చేసిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మరికొందరేమో రష్మిక విజయ్ దేవరకొండకు దూరం కావడానికి సమంతనే కారణమంటున్నారు.

విజయ్ - రష్మిక
విజయ్ – రష్మిక

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సమంత ఖుషీ అని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింగిల్ బీట్ తోనే క్లీన్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ క్లియర్ క్లారిటీగా చెప్పేసాడు శివ నిర్వాణ . అయితే ఇంతటి మంచి క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీని చేతులారా మిస్ చేసుకుంది స్టార్ హీరోయిన్ అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల బ్యూటీ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన . ఎస్ శివనిర్వాణ కథను అనుకున్నప్పుడు మొదట అనుకున్న హీరోయిన్ రష్మిక అంట . హీరోగా విజయ్ దేవరకొండ హీరోయిన్గా రష్మిక అయితే ఈ కథకు బాగుంటుంది అంటూ అప్రోచ్ అయ్యారట . విజయ్ దేవరకొండ ఓకే చేసిన కూడా రష్మిక ఈ సినిమా యాక్సిప్ట్ చేయలేక పోయిందట . దీంతో ఈ ఆఫర్ సమంతను వరించిందట. ఇక ఈ విషయం బయటకు వచ్చిన దగ్గరి నుంచి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Samantha - rashmika mandanna

ఇక గతంలో సమంతపై తన ప్రేమను పబ్లిక్ గానే రష్మిక తెలిపింది. రష్మిక మాట్లాడుతూ.. సమంత నాకు చాలా ఇన్స్పిరేషన్. సమంత నాకు మంచి స్నేహితురాలు కూడా. ఆమె మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు తను ప్రకటించేదాకా కూడా నాకు తెలీదు. అందరికి ఎలా తెలిసిందో నాకు కూడా అలాగే తెలిసింది. సమంత ఒక గొప్ప మహిళ. అందర్నీ చాలా బాగా చూసుకుంటుంది. సమంత జీవితంలో ఎన్నో సవాళ్ళని ధైర్యంగా పోరాడి నిల్చుంది. అలాంటి వ్యక్తిని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. నాకైతే సమంత దగ్గరుండి ఆమెకి అమ్మలా ఉండి చూసుకోవాలని ఉంది. ఆమెకి అన్నివిధాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. దీంతో రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here