మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభం సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఆయన తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రం రీమేక్ ‘భోళా శంకర్’ లో హీరో గా నటిస్తున్నాడు.ఈ చిత్రం ఆగస్టు 11 వ తేదీన విడుదల కాబోతుంది.ఫ్యాన్స్ ఈ చిత్రం పై మొదటి నుండి అంచనాలతో లేరు,ఎందుకంటే అది రీమేక్ కాబట్టి.
రీమేక్ సినిమాలు ఇప్పుడు సరిగా ఆడడం లేదు అనే విషయం అందరికీ తెలిసినదే.ఫ్యాన్స్ మొదటి నుండి సోషల్ మీడియా ద్వారా చిరంజీవి ని రీమక్స్ వద్దు అంటూ బ్రతిమిలాడుతూనే ఉన్నారు, మొన్నీమధ్యనే ఇక మెగాస్టార్ రీమేక్స్ కి నో చెప్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో వచ్చిన ఒక వార్తని చూసి ఎంతో ఆనందపడ్డారు ఫ్యాన్స్.
కానీ ఆ అనందం కాసేపు కూడా మిగలలేదు.ఇక అసలు విషయానికి వస్తే మలయాళం లో మోహన్ లాల్ మరియు పృథ్వీ రాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో ‘బ్రో డాడీ’ అనే చిత్రం వచ్చింది.ఈ చిత్రం థియేటర్స్ లో కాకుండా నేరుగా డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చెయ్యబోతున్నాడు అట.
మోహన్ లాల్ క్యారక్టర్ లో చిరంజీవి మరియు పృథ్వీ రాజ్ క్యారక్టర్ లో విజయ్ దేవరకొండ లేదా సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ మరియు ‘బంగార్రాజు’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, అధికారిక ప్రకటన వచ్చిన రోజు ఫ్యాన్స్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.