సింగర్ సునీత పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినీ ఇండస్ట్రీలో ఆ స్వరానికి ఫ్యాన్స్ ఎక్కువే.. గతంలో కేవల పాటలతో మాత్రమే ఫెమస్ అయిన ఆమె ఈమధ్య రెండో పెళ్లి చేసుకొని ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది.. తాను ఎం చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.. తాజాగా సునీత గురించి మరో వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. తన భర్త తో విడాకులు తీసుకున్న తర్వాత ఓ డైరెక్టర్ ను ప్రేమించిందట.. అతనితో సన్నిహితంగా ఉందట.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
ఇక ఈమె 19 ఏళ్ల వయసులోనే ఇంట్లో వాళ్లకి చెప్పకుండా సీక్రెట్ గా కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. అది ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు దాంతో ఫ్యామిలీకి దూరమైంది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు ఫ్యామిలీ దగ్గరికి తీసింది.అలా సింగర్ సునీత ఒక పాప బాబుకు జన్మనిచ్చింది. అయితే సునీత ఎప్పుడైతే ఫ్యామిలీతో కలిసిందో అప్పటినుండి మళ్ళీ సినిమాల్లో పాడడం మొదలుపెట్టింది. ఇక సినిమాల్లో పాటలు పాడడం వల్ల వచ్చిన డబ్బు నుండి కొంచెం పేరెంట్స్ కి ఇచ్చేది.. అలాగే ఇంకొంత ఫ్యామిలీకి వాడుకునేది. అలా తాను పాటలు పాడడం వల్ల వచ్చిన డబ్బులు తన పేరెంట్స్ కి సహోదరులకు ఇవ్వడం సునీత భర్తకు అస్సలు ఇష్టం లేదు.. దాంతో ఎప్పుడూ గొడవలు వచ్చేవి అట..
ఇకపోతే సునీతకి ఇతర మ్యూజిక్ డైరెక్టర్ లతో సింగర్ సునీతకి ఎఫైర్ ఉందని, ఆ కారణంతోనే వాళ్లు వరసగా ఈమెకు అవకాశాలు ఇస్తున్నారని కొందరు సునీత అంటే పడని సింగర్స్ ప్రచారం చేశారు. ఆ వార్తలు నిజమేనని నమ్మిన ఆమె భర్త కిరణ్ తరచూ సునితను నిందిస్తూ అనుమానించేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు సింగర్ సునీత భర్త కిరణ్ ఫ్రెండ్ అయినా డైరెక్టర్ విఎన్ ఆదిత్య తో కాస్త సన్నిహితంగా మెదిలిందట.. దాంతో అందరు ఆయనతో ప్రేమాయణం నడుపుతుంది.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అని ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొట్టింది.. కానీ సునీత డాన్ని పట్టించుకోలేదు.. ఇక రామ్ వీరపనేని ఇష్టపడి పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు ఈమె కుటుంబ భాధ్యతలను నిర్వర్తిస్తూ కేరీర్ పరంగా దూసుకుపోతుంది..