ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన నటుడు విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా, ఇంత తక్కువ సమయం ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించడం బహుశా రీసెంట్ సమయం లో ఎక్కడా జరగలేదు, ఒక్క విజయ్ దేవరకొండ విషయం లో తప్ప.ఈయనకి ఇండస్ట్రీ లో కూడా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, ముఖ్యంగా హీరోయిన్లు విజయ్ దేవరకొండ అంటే మెంటలెక్కిపోతుంటారు.కానీ ఒక్కరికి మాత్రం విజయ్ దేవరకొండ అంటే అసలు పడదు.
ఆమె అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పటి నుండి విజయ్ దేవరకొండ ఏమి చేసినా విమర్శిస్తూ వస్తుంది. ఇండస్ట్రీ లో ఉంటూ, ఇలా సాటి నటుడిపై ఇంతలా ఏడవడం అనేది హర్షించదగ్గ విషయం కాదు.ఇంతకీ విజయ్ దేవరకొండ పై అంతలా నోరు పారేసుకుంటున్న నటి మరెవరో కాదు, యాంకర్ అనసూయ.ఇప్పుడు ఈమె సినిమాల్లో కూడా పెద్ద క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిన సంగతి తెలిసిందే.
ఇక అసలు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఖుషి’ లోని మొదటి పాట ‘నా రోజా నువ్వే’ ఈరోజు విడుదల అయ్యింది.ఈ పాటకి సంబంధించి ఒక పోస్టర్ ని విడుదల చేసారు, ఈ పోస్టర్ లో ‘ఖుషి’ టైటిల్ మీద హీరో మరియు హీరోయిన్ పేర్లు ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ తన పేరుకి ముందు ‘ది’ అని తగిలించుకోవడాన్ని అనసూయ తప్పుబట్టింది.
ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుడే ఒకటి చూసాను..’ది’ అంట, బాబోయ్!! పైత్యం.. ఏం చేస్తాం, అంటకుండా చూసుకుంటాం’ అంటూ ఒక ట్వీట్ వేసింది.ఈమె వేసిన ఈ ట్వీట్ కి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండి చాలా ఘాటు రియాక్షన్ వచ్చింది, ఆ రియాక్షన్ ని గమనించిన అనసూయ వెంటనే మరో ట్వీట్ వేస్తూ ‘భలే రియాక్ట్ అవుతున్నారు.. దొంగలు.. బంగారుకొండలట, ఎక్కడో అక్కడ నేను అనేది నిజం ని నిరూపిస్తున్నందుకు థాంక్స్ రా అబ్బాయిలు’ అంటూ ఆమె కామెంట్ చేసింది. ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
Ippude okati chusanu.. “The” na?? Babooooiii!!! Paityam.. enchestam.. antakunda chuskundam 🙊
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 5, 2023