పొన్నియన్ సెల్వన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయిన బెంచ్ మార్క్ వెయ్యి కోట్లు.భారీ బడ్జెట్ సినిమాలు, కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ని దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని బలంగా నమ్మే మేకర్స్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టిన సినిమాలు బాహుబలి 2 , #RRR ,KGF చాప్టర్ 2 మరియు రీసెంట్ గా పఠాన్.
ఇప్పుడు ఈ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ జాబితాలోకి పొన్నియన్ సెల్వన్ సిరీస్ చేరబోతుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. పొన్నియన్ సెల్వన్ ఇప్పటి వరకు మొదటి వారం లో అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సమ్మర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన అతి తక్కువ సినిమాలలో ఒకటి గా నిల్చింది ఈ చిత్రం.
మొదటి భాగం సుమారుగా అన్నీ భాషలకు కలిపి 500 కోట్ల రూపాయిలను వసూలు చేసింది. అలా రెండు భాగాలకు కలిపి ఈ సినిమా ఇప్పటి వరకు 750 కోట్ల రూపాయిలను రాబట్టింది.కలెక్షన్స్ ఇప్పటికీ స్టడీ గా ఉండడం తో ఫుల్ రన్ లో కచ్చితంగా మరో 250 కోట్ల రూపాయిలను వసూలు చేస్తుందని, అలా రెండు భాగాలకు కలిపి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన చిత్రంగా, వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరిన సినిమాలలో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇది ఎంత మాత్రం నిజం అవుతుందో చూడాలి.ఇక పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం, కేవలం మొదటి వారం లోనే ఓవర్సీస్ లో వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందట.ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.