చైతన్య మాస్టర్ ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ’ లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చైతన్య మాస్టర్ ఇటీవలే అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. చనిపోయే ముందు ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో కలకలం రేపుతున్నాయి. జబర్దస్త్ లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఎక్కువ డబ్బులిస్తున్నారని, కానీ ఢీ షో లో మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారంటూ చైతన్య మాస్టర్ తన చివరి సెల్ఫీ వీడియో లో చెప్పుకొచ్చాడు.
ఇదే విషయాన్నీ ఢీ లో ఒక కంటెస్టెంట్ గా చేస్తున్న రాజుని అడగగా , ఆయన కూడా ఇదే చెప్పాడు. ఒక కొరియోగ్రాఫర్ కి ఈ షో లో ఒక్కో పాటకు గాను కేవలం 30 నుండి 40 వేల రూపాయిలు మాత్రమే ఇస్తున్నారని. ఆ పాటకి వాడే ప్రాపర్టీస్ మరియు గ్రూప్ డ్యాన్సర్స్ కి మొత్తం డ్యాన్స్ మాస్టర్ ఇవ్వాల్సి వచ్చేదట.
వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోక పైన మరో రెండు లక్షలు వేసుకుంటే కానీ ఒక పాటని పూర్తి చేయలేమని. చైతన్య మాస్టర్ అలా అప్పులపాలయ్యాడని చెప్పుకొచ్చాడు.కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేస్తేనే ఢీ షో కి TRP రేటింగ్స్ వస్తాది. అలాంటిది వాళ్లకి ఇంత తక్కువ డబ్బులిచ్చి, ఇలా డ్యాన్స్ మాస్టర్స్ కి కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెట్టడం ఇదెక్కడి న్యాయమని నెటిజెన్స్ ఢీ నిర్వాహకులపై , మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పై విరుచుకుపడుతున్నారు.
కేవలం వీళ్ళ వల్లే ఈరోజు చైతన్య మాస్టర్ అప్పుల పాలై ప్రాణాలను తీసుకున్నాడని, తనకి క్రేజ్ మరియు ఫేమ్ ఇచ్చిన ఢీ షో మీద ఆరోపణలు చెయ్యలేక చైతన్య కేవలం తన బాధల్ని చెప్పుకున్నాడని అంటున్నారు నెటిజెన్స్. డ్యాన్స్ మాస్టర్స్ మరియు కంటెస్టెంట్స్ కష్టపడితే వచ్చే డబ్బులను ఎంజాయ్ చేస్తూ ఇలా వాళ్లకు నరకం చూపించడం మంచిది కాదని,ఇకనైనా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కళ్ళు తెరిచి మానవత్వం చూపాలని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.