సమంత.. నాకు పెద్ద గుణపాఠం నేర్పింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య

- Advertisement -

ప్రస్తుతం నాగచైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తను హీరోగా నటించిన ‘కస్టడీ’ (Custody) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్ కాగా.. అరవింద్ స్వామి విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య.. తన లైఫ్‌లో అతిపెద్ద పశ్చాత్తాపం (Biggest Regret) గురించి ఓపెన్ అయ్యాడు. ఈ టాపిక్‌పై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు.

నాగచైతన్య
నాగచైతన్య

సమంతతో (Samantha) విడిపోయిన తర్వాత అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya Akkineni) కామ్‌గా సినిమాలు చేసుకుంటున్నాడు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా సామ్ కొన్నిసార్లు ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చినప్పటికీ చైతన్య మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. తాజాగా చెప్పిన మాటలు మాత్రం సమంతను ఉద్దేశించినవే అని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ‘కస్టడీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాగ చైతన్య ఇటీవల ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Naga chaitanya samantha

అందులో నాగచైతన్య మాట్లాడుతూ. ‘మీ జీవితంలో పశ్చాత్తాపపడ్డ సంఘటనలు, విచారకరమైనవి గానీ ఉన్నాయా..’ అని అడగ్గా.. అలాంటివి ఏవీ లేవని సమాధానం చెప్పారు. ‘ఇప్పటి వరకు నా లైఫ్‌లో విచారకరమైన సంఘటనలు ఏవీ లేవు. జీవితంలో జరిగే ప్రతిదీ ఒక పాఠాన్ని నేర్పుతుంది. సినిమాల విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డా.. కొన్ని సినిమాలపై సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయానని పశ్చాత్తాపపడుతుంటా. మూడు సినిమాల విషయంలో అలా జరిగింది’ అని చెప్పారు. ఇదిలా ఉంటే, నాగ చైతన్య సవతి సోదరుడు అఖిల్ అక్కినేని, శోభితా ధూళిపాళతో డేటింగ్ రూమర్స్ పై ఇటీవల స్పందించినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన అతని చిత్రం ఏజెంట్, ఏజెంట్ యొక్క విలేకరుల సమావేశంలో, ‘అఖిల్ లండన్ నుండి శోభితతో చైతన్య యొక్క వైరల్ ఫోటో గురించి అడిగారు.

- Advertisement -
Naga chaitanya samantha Photos

అయితే నాగ చైతన్య, శోభిత డేటింగ్‌పై సమంత కామెంట్ చేసినట్లుగా కొన్ని రూమర్స్ మీడియాలో స్ర్పెడ్ అయ్యాయి. అతను ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే మంచిదని ఆమె చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను ఖండించిన సామ్.. తానెప్పుడూ అలా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక రీసెంట్‌గా ‘ఏజెంట్’ ప్రెస్ మీట్‌లో అఖిల్‌కు సైతం నాగ చైతన్య, శోభిత డేటింగ్ గురించి ప్రశ్న ఎదురవగా.. తనకు తెలియదంటూ స్పష్టంగా చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here