అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ ఇటీవలే విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని అభిమానులు ఈ సినిమా పై కోటి ఆశలు పెట్టుకున్నారు. స్టార్ రేంజ్ హైప్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ కి ఇప్పటి వరకు సరైన సూపర్ హిట్ లేకపోయినా,ఈ ‘ఏజెంట్’ చిత్రం తో ఏకంగా వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి స్టార్ లీగ్ లోకి అడుగుపెడుతాడని గర్వంగా చెప్పుకున్నారు.
ఈ సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో అలాంటి అంచనాలు ఉండేవి అప్పట్లో, కానీ కరోనా ఈ సినిమా హైప్ మొత్తాన్ని మింగేసింది. దానికి తోడు ఒక్క పాట కూడా సూపర్ హిట్ కాకపోవడం ఈ సినిమా పై అంచనాలు క్రియేట్ చేయలేకపోయాయి.అందువల్ల ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు కూడా సరిగా రాలేదు.
ఓపెనింగ్స్ రాకపోయినా కనీసం వీకెండ్ వరకు అయినా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు ట్రేడ్. కానీ ఈ చిత్రం గత ఏడాది విడుదలైన మంచు విష్ణు ‘జిన్నా’ చిత్రనికంటే దారుణమైన వసూళ్లను నమోదు చేసుకుంటుంది.జిన్నా చిత్రానికి మూడవ రోజు 70 లక్షల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ ‘ఏజెంట్’ చిత్రం మూడవ రోజు కేవలం 60 లక్షల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
80 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసి, ఒక సినిమా ఈ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం అనేది , ఇది వరకు ఎప్పుడూ జరగలేదు. పాపం అఖిల్ ఏజెంట్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు, ఆ కష్టానికి తగిన ఫలితం సూన్యం. ఇక ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో రెంటల్ బేసిస్ మీద థియేటర్స్ ని నడపడం చాలా కష్టం అయిపోతుంది. మూడు రోజులకు కలిపి ఈ సినిమా రెండు కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది. అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న ఈ సినిమా, చివరికి మాయని మచ్చ లాగ మిగిలిపోయింది.