Hansika Motwani : హన్సిక పెళ్లికి వాళ్లే స్పెషల్ గెస్ట్​లు.. యాపిల్ బ్యూటీ మనసుకు నెటిజన్లు ఫిదా

- Advertisement -

యాపిల్ బ్యూటీ.. అదేనండి మన దేశముదురు భామ.. హన్సిక మోత్వానీ ఇవాళ తన బాయ్​ఫ్రెండ్​ సోహైల్​ను వివాహమాడింది. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీ, మెహందీ, హల్దీ, సంగీత్, ప్రీ వెడ్డింగ్ బాష్ ఇలా అన్ని వేడుకలు పూర్తయ్యాయి. ఆదివారం రోజున హన్సిక-సోహైల్ Hansika Motwani – Sohael Katuriya జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తమ పెళ్లి వేడుకలను సూపర్​గా ఎంజాయ్ చేశారు. వారి సెలబ్రేషన్స్​కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Hansika Motwani - Sohael Katuriya
Hansika Motwani – Sohael Katuriya

హన్సిక-సోహైల్​ల వివాహం గురించి సోషల్ మీడియాలో ఓ సూపర్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోయిన్ వివాహం అంటే చీఫ్‌ గెస్ట్‌లుగా పాపులర్ పర్సనాలిటీలు, బిగ్‌షాట్‌లు, సెలబ్రిటీలు, వీవీఐపీలను ఆహ్వానిస్తారు. కానీ ఈ యాపిల్ బ్యూటీ మాత్రం తన ముఖమే కాదు మనసు కూడా ఎంతో అందమైందని ప్రూవ్ చేసుకుంది. తన పెళ్లికి ఎవరూ ఊహించని వాళ్లను గెస్ట్‌లుగా ఆహ్వానించింది. జైపూర్‌లోని ఓ రాజకోటలో జరుగుతున్న తన పెళ్లికి తప్పకుండా రావాలంటూ స్పెషల్‌గా వాళ్లకు ఆహ్వానం కూడా పంపించింది. ఇంతకీ ఆ గెస్టులు ఎవరంటే..?

డబ్బున్న వాళ్లందరికి మంచి మనసు ఉండదు. అలాగని మంచి మనసు ఉన్న వాళ్లకు పేదల్ని ఆదుకునేంత డబ్బు ఉండదు. ఈ రెండు ఉన్నవాళ్లు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కొద్ది మందిలో ఒకరే హన్సిక. డిసెంబర్ 4న జరిగిన తన వివాహానికి చీఫ్ గెస్టులుగా వీధి బాలలు, అనాథ చిన్నారులను ఆహ్వానించింది ఈ బ్యూటీ. సోహైల్‌తో గ్రాండ్‌గా జరుగుతున్న తన వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అతి తక్కువ మందిని ఆహ్వానించింది హన్సిక. అయితే పెళ్లి వేడుకలకు మాత్రం తప్పకుండా రావాలంటూ ప్రత్యేక ఆహ్వాన పత్రికలు ముద్రించి వారికి పంపించింది. వాళ్లే నిరుపేద చిన్నారులు. కేవలం బయట కనిపించే అందమే కాదు తన మనసు కూడా అంతకు మించి అందమైందని ఈ బ్యూటీ చాటింది. ఇదే కాదు హన్సిక.. ఇప్పటికే చాలా మంది పేద పిల్లలకు సాయం చేసేందుకు కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోంది.

- Advertisement -

తన పెళ్లికి నిరుపేద చిన్నారులనే ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని కోరింది హన్సిక. తమను హన్సిక తన పెళ్లికి పిలిచిందని రాబిన్ హుడ్ ఆర్మీ చిన్నారులు చెప్పారు. ఇన్విటేషన్ కార్డులను చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. తన లైఫ్​లో ఎంతో ఇంపార్టెంట్ అయిన పెళ్లి వేడుకకు.. తన కుటుంబం, బంధువులు, స్నేహితులతో సమానంగా తమను కూడా స్పెషల్ గెస్టులుగా ఆహ్వానించడంపై ధన్యవాదాలు చెప్పారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మా యాపిల్ బ్యూటీ మనసు వెన్న అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మన దేశముదురు సాయం చేయడంలో నిజంగానే ముదురు అంటూ తెగ పొగిడేస్తున్నారు.

తన పెళ్లికి పేద చిన్నారుల్ని చీఫ్‌ గెస్టులుగా పిలవడమే కాదు.. జైపూర్‌లోని కోట సమీపంలో ఉన్న చిన్నారులకు హన్సికా వివాహ భోజనాన్ని పంపించిందట. గొప్ప వాళ్లు ఎప్పుడూ తమ స్థాయిలో ఉండే వాళ్ల గురించే ఆలోచిస్తారు. కానీ హన్సిక లాంటి స్టార్ హీరోయిన్ తన వివాహ వేడుకల సమయంలో ఈ విధంగా పేద చిన్నారుల్ని గుర్తుంచుకొని ఆహ్వానించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here