Tollywood : ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లను సాధించిందో తెలుసా..! బాహుబలి సిరీస్ ఒక పక్కకి కూడా సరిపోదు!

- Advertisement -

Tollywood : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి మొట్టమొదటి సూపర్ స్టార్..సాహసమే ఊపిరి గా బ్రతికిన మహామనిషి, టెక్నాలజీ పరంగా ఇండస్ట్రీ ని మరోలెవెల్ కి తీసుకెళ్లి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన మహానుభావుడు. ఆయనకీ ఉన్నన్ని రికార్డు లు ఇండస్ట్రీ లో మరో హీరో కి లేదు.. ఎదో సినిమా చూశామా,ఎంజాయ్ చేశామా, ఇంటికి తిరిగి వెళ్ళామా అనే విధంగా ప్రేక్షకులు తీరు ఉన్న రోజుల్లో కృష్ణ గారు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. మాస్ ఆడియన్స్ కి ఆరాధ్య దైవంలాగా మారాడు. తెలుగు చలన చిత్ర బాక్స్ ఆఫీస్ హిస్టరీ మర్చిపోలేని ఎన్నో అరుదైన రికార్డ్స్ ని నెలకొల్పాడు,ఆ రికార్డ్స్ ని ఇప్పటికి ఎన్ని పాన్ ఇండియన్ చిత్రాలు విడుదలైన బ్రేక్ చేయలేకపోయాయి అంటే ఆయన ఆరోజుల్లో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రం సృష్టించిన రికార్డ్స్ గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాము.

Tollywood
Tollywood

ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ సినిమాలకు జనాలు బాగా అలవాటు పడిన రోజులవి,జానపదాలు , పౌరాణికాలు మరియు కుటుంబ కథ చిత్రాలే రాజ్యమేలుతున్న రోజులవి.అలాంటి రోజుల్లో కృష్ణ గారు యువ హీరోగా ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చాడు,అప్పటికే ఆయన 40 సినిమాల్లో హీరోగా నటించాడు..మంచి క్రేజ్ రప్పించుకోగలిగాడు కానీ.పెద్ద స్టార్ హీరో మాత్రం కాలేదు.జనాలకు ఎదో ఒక కొత్త తరహా అనుభూతిని కలిగించే సినిమా చెయ్యాలని కృష్ణ గారు తపించేవారు.అలాంటి సమయం లో హాలీవుడ్ లో ‘మేకనస్ గోల్డ్’ అనే చిత్రం విడుదలై పెద్ద హిట్ అయ్యింది,ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి.ఈ చిత్రం కృష్ణ గారికి తెగ నచ్చేసింది,ఎలా అయినా ఈ తరహా సినిమాని తెలుగు ప్రేక్షకులకు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మలచి విడుదల చెయ్యాలనుకున్నాడు కృష్ణ.ప్రముఖ రచయితా మరియు దర్శకులైన ఆరుద్ర గారిని పిలిచి ఈ ఐడియా తో మన నేటివిటీ కి తగ్గట్టుగా కథ సిద్ధం చెయ్యి.దానికి నువ్వే దర్శకత్వం వహించాలి అన్నాడు.

Supe Star Krishna

అలా కృష్ణ గారి సూచనలతో తయారైన ఈ కథ కార్యరూపం దాల్చింది.కేవలం 28 రోజుల్లోనే 8 లక్షల రూపాయిల బడ్జెట్ తో ఈ సినిమాని పట్టాలెక్కించారు.ఆ రోజుల్లో 8 లక్షల రూపాయిల బడ్జెట్ అంటే 100 కోట్ల రూపాయిల బడ్జెట్ తో సమానం.సుమారు 35 కేంద్రాలలో ఘనంగా విడుదలైన ఈ చిత్రం తెలుగు లో తొలుత నెగటివ్ రివ్యూస్ ని అందుకుంది,మన తెలుగు జనాలు నచ్చారు అనుకున్నారు..కానీ ఆ సమయం లో ఎన్టీఆర్ గారు కృష్ణ గారికి ధైర్యం చెప్పారు.ఈ చిత్రం సంచలన విజయం సాధించి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది.కంగ్రాట్స్ బ్రదర్ అని శుభాకాంక్షలు తెలియచేసారు.ఎన్టీఆర్ గారు చెప్పినట్టే ఈ చిత్రం నెగటివ్ రివ్యూస్ ని అధిగమించి తెలుగునాట సంచలన విజయం సాధించింది.

- Advertisement -
Supe Star Krishna Movies

కేవలం తెలుగు వెర్షన్ లోనే 50 లక్షల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత హిందీ మరియు తమిళం బాషలలో విడుదల చేసారు..అక్కడి ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు.. ఇక ఆ తర్వాత హాలీవుడ్ లో ‘ట్రెజన్ హంట్’ అనే పేరు తో అనువదించి విడుదల చేసారు.. అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఈ చిత్రం 64 దేశాల్లో విడుదలై అన్ని చోట్ల ఘనవిజయం సాధించింది. అలా అన్ని భాషలకు కలుపుకొని ఈ చిత్రం సుమారుగా 5 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ఆరోజుల్లో 5 కోట్లు అంటే ఇప్పుడు రెండు వేలకోట్ల రూపాయలతో సమానం. ఈ సినిమా విడుదలైనన్ని భాషల్లో #RRR మరియు బాహుబలి సినిమాలు కూడా విడుదల కాలేదు. ఇప్పటికి ఈ రికార్డు అన్ బీటబుల్ గానే మిగిలిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here