Kamna Jathmalani : టాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ ని సంపాదించిన హీరోయిన్స్ లో ఒకరు కామ్నా జఠ్మలానీ. ఈమె ప్రేమికులు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది.తొలి సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినా, మ్యాచో స్టార్ గోపీచంద్‌తో చేసిన “రణం” అనే చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈమెకి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి.
2014 వ సంవత్సరం లో సూరజ్ నాగ్‌పాల్‌తో అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు విరామం ఇచ్చింది.అయితే ఈ పెళ్ళికి ముందే కామ్నా జఠ్మలానీ కి ఒక వ్యక్తి తో వివాహం అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అప్పట్లో ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యింది.పెళ్ళైన హీరోయిన్స్ కి ఇండస్ట్రీ లో అవకాశాలు రాదు అనే విషయం తెలిసిందే, అందుకే ఆ విషయాన్నీ ఆమె గోప్యంగా ఉంచిందని తెలుస్తుంది.
మొదటి భర్త మంచోడు కాదని, ప్రతీ రోజు తాగేసి వచ్చి ఇంట్లో గొడవలు చేసేవాడని, అందుకే అతనిని భరించలేక విడాకులు ఇచ్చేసిందని తెలుస్తుంది.కుటుంబ పోషణ బాధ్యత మొత్తం తనపైన ఉండడం వల్ల, పెళ్ళైన విషయం గోప్యంగా ఉంచిందని, ఆ తర్వాత సూరజ్ నాగ్ పాల్ అనే మంచి వ్యక్తి పరిచయం అవ్వడం తో అతనిని ప్రేమించి అందరి సమక్షం లో పెళ్లి చేసుకుందని తెలుస్తుంది.
కామ్నా జఠ్మలానీ ప్రస్తుతం సినిమాల్లో యాక్టీవ్ గా లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఈ క్రేజీ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తరచూ తనకి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు. రీసెంట్ గా ఆమె పెట్టిన కొన్ని పోస్టులు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది, ఆ ఫోటోలను మీరు కూడా క్రింద చూడవచ్చు.