Super Star Krishna – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ సినిమా అదేనా!

- Advertisement -

Super Star Krishna గారి నట ప్రస్థానం గురించి అందరికి తెలిసిందే,ఆయన ఒక తెరిచిన పుస్తకం లాంటివాడు.తన తుదిశ్వాస వరుకు ఇండస్ట్రీ లో నటుస్తునే ఉండాలనుకున్నారు,కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన 2016 వ సంవత్సరం శ్రీ శ్రీ మూవీ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.అయితే కృష్ణ గారు మహేష్ బాబు సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరో పాత్రలకు దూరమై ప్రత్యేకమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు.

Super Star Krishna
Super Star Krishna

ఆయన స్టార్ హీరో గా కొనసాగుతున్న సమయం లో కూడా తన తోటి స్టార్ హీరోలందరితో కలిసి మల్టీస్టార్ర్ర్ , సినిమాలు చేసాడు.ఎన్టీఆర్ , నాగేశ్వరరావు,శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన కృష్ణ ఈ తరం స్టార్ హీరోలలో తన కొడుకు మహేష్ తో తప్ప మరో హీరోతో నటించలేదు.అయితే గతం లో ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది.

krishna

పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ గా పిలవబడే సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో నటించిన రఘువరన్ పాత్రకి తొలుత శోభన్ బాబు గారిని అడిగారు.అప్పటికే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన శోభన్ బాబు ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకుకొలేదు.ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిని అడిగారు.ఆయన ఈ చిత్రం లో నటించడానికి తొలుత ఒప్పుకున్నారు కానీ షూటింగ్ అనుకున్న సమయం లో ప్రారంభం అవ్వకపోవడం తో కృష్ణ గారు డేట్స్ ని సర్దుబాటు చేయలేకపోయారు.

- Advertisement -
pawan kalyan

దీనితో ఈ సినిమా నుండి కృష్ణ గారు తప్పుకోవాల్సి వచ్చింది.అలా పవన్ కళ్యాణ్ – కృష్ణ గారి కాంబినేషన్ మిస్ అయ్యింది.గతం లో పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య చిరంజీవి గారితో కృష్ణ గారు మూడు సినిమాలు చేసాడు..వాటిల్లో తోడు దొంగలు అనే సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు రాలేదు.

pawan
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here