Sara Tendulkar : రామ్ చరణ్ సరసన సచిన్ టెండూల్కర్ కూతురు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్!

- Advertisement -

Sara Tendulkar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో కాదు, పాన్ వరల్డ్ హీరో.ఇక నుండి ఆయన తీసే ప్రతీ సినిమా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తియ్యాలి.#RRR తర్వాత ఆయన సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.శంకర్ అంటే పాన్ ఇండియన్ డైరెక్టర్, సబ్జెక్టు కూడా ఆ రేంజ్ ఎంచుకొని చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు.ఇది కూడా పాన్ ఇండియన్ సబ్జెక్టు, శ్రీకాకుళం రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చెయ్యబోతున్నాడు, కబ్బడి టీం కెప్టెన్ గా ఒక పాత్ర అవ్వగా,మరో పాత్రకి కాళ్ళు ఉండవు.కెరీర్ లో మరోసారి రిస్క్ తీసుకొని ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నాడు.

ఇక ఇందులో హీరోయిన్ పాత్ర గురించి సోషల్ మీడియా గత కొంతకాలం ఎదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఇందులో హీరోయిన్ గా సచిన్ టెండూల్కర్ కూతురు సరా టెండూల్కర్ నటించబోతుంది అట.రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక విలేఖరి అడిగిన ప్రశ్న కి జవాబుగా చెప్పింది సరా. వీరిలో ఏ హీరోతో కలిసి నటించే ఛాన్స్ వస్తే వదులుకోరు అన్న ప్రశ్నకి సరా టెండూల్కర్ రామ్ చరణ్ పేరు చెప్పింది.

- Advertisement -

సరా టెండూల్కర్ త్వరలోనే సినిమాల్లోకి అడుగుపెట్టబోతుంది. ఆమె తొలి సినిమా రామ్ చరణ్ తో ఎందుకు అవ్వకూడదు, బుచ్చి బాబు తో తెరకెక్కించబోయ్యే సినిమాలో హీరోయిన్ అవకాశం ఇవ్వాలంటూ రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో అడుగుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here