Anupama Parameswaran ఈ కేరళ క్యూటీ ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఆ చిత్రంలో కనిపించింది కాసేపే అయినా తన నూడుల్ హెయిర్‌తో.. క్యూట్ స్మైల్‌తో తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది. సాధారణంగా హీరోయిన్లు తమ ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత మెయిన్ క్యారెక్టర్లను ఎంచుకుంటూ కెరీర్లో ఫాస్ట్‌గా దూసుకెళ్లాలనుకుంటారు.
కానీ అనుపమ మాత్రం ప్రేమమతో తనకు ఫేమ్ వచ్చినా.. తన సెకండ్ మూవీ అ.ఆ.లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. చెప్పాలంటే సెకండ్ హీరోయిన్ రోల్. ఆ చిత్రంలోనూ కనిపించింది కాసేపే అయినా తన అందం, అభినయంతో కట్టిపడేసింది. త్రివిక్రమ్ అనుపమను ఎందుకు ఆ రోల్లో తీసుకున్నాడో ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థమైంది.
ఇక అ.ఆ. సినిమా తర్వాత అనుపమకు టాలీవుడ్లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ బ్యూటీ ఇక అప్పట్నుంచి తిరుగులేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో జత కడుతూ సత్తా చాటింది. గతేడాది కార్తికేయ 2 సినిమాతో ఈ భామ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ తర్వాత నిఖిల్‌తో కలిసి 18 పేజెస్‌లో నటించింది. ఆ సినిమాలో నందిని పాత్రను చూసి తెలుగు కుర్రాళ్లు మరోసారి అను మాయలో పడిపోయారు. ఇక 18 పేజెస్ తర్వాత ఈ భామ బటర్‌ఫ్లై అనే చిత్రంలో సందడి చేసింది. ప్రస్తుతం అనుపమ టిల్లు స్వ్కేర్ సినిమాలో నటిస్తోంది.
టిల్లు స్వ్కేర్ సినిమా షూటింగులో బిజీబిజీగా ఉన్న అనుపమ టైం దొరికితే చాలు తన ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే సాధారణంగా ఫొటోషూట్ అంటే హీరోయిన్లు.. తెగ రెడీ అయిపోయి పోజులిస్తూ ఉంటారు. కానీ అనుపమ మాత్రం అలా కాదు. తన క్యాజువల్ డ్రెస్సుల్లోనే ఈ భామ క్యూట్ పోజులిస్తూ ఆకట్టుకుంటుంది.
తాజాగా అనుపమ క్యూట్ ఫొటోలతో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది అనుపమ. బ్లాక్ కలర్ కుర్తీలో ఈ బ్యూటీ చాలా సింపుల్‌గా కనిపించింది. ఏదో రెస్టారెంట్లో కూర్చుని క్యూట్ పోజులిచ్చింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. సింపుల్‌గా ఉన్న అనుపమ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.