Samantha : సమంతకు ఏ రోగం లేదా.. అంతా నాటకమేనా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

- Advertisement -

Samantha : సమంత ఇటీవల నటించిన యశోద, శాకుంతలం సినిమాల్లో నటించింది. అందులో య‌శోద మాత్ర‌మే మంచి టాక్ అందుకోగా, శాకుంత‌లం నిరాశ‌ప‌ర‌చింది. అయితే యశోద విడుదలకు ఒక వారం రోజుల ముందు నాకు భయంకరమైన వ్యాధి అంటూ సమంత చెప్పడం కలిసొచ్చింది. య‌శోద మంచి హిట్ కొట్టింది. శాకుంతలం మాత్రం భయంకరమైన ప్లాప్ ను మూటకట్టుకుంది.

samantha
samantha

ఇదంత ఒక ఎత్తు అయితే స‌మంత ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఆమె సినిమాల కన్నా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తోనే హాట్ టాపిక్ అవుతుంది. యశోద అప్పుడు వర్క్ అవుట్ అయిన సింపతిని శాకుంతలంకు వాడుకుందామని చూసిందంటున్నారు నెటిజన్లు. అందుకే శాకుంతలం ప్రమోషన్స్ లో కొత్త అవతారం ఎత్తింది. తెల్ల బట్టలు, జపమాలతో కనిపిస్తూ… ప్రమోషనల్ ఈవెంట్స్ లో కన్నీరు కార్చింది. దగ్గుతూ కనీస ఓపిక లేదని మీడియా ముందు తన అనారోగ్య పరిస్థితి గురించి చెబుతూ ఎమోష‌న‌ల్‌గా మట్లాడింది. శాకుంత‌లం విడుద‌ల‌కి రెండు రోజుల ముందు సమంత తనకు జ్వరం సోకినట్లు కూడా ట్వీట్ చేశారు.

Actress Samantha
Actress Samantha

కానీ ఆ తర్వాత రోజే విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ప్రమోషన్స్ లో పాల్గొన్న స‌మంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో స‌రికొత్త‌గా క‌నిపించింది. వారం రోజుల క్రితం జ్వరం, తీవ్ర నీరసమని చెప్పిన సమంత విదేశాలకు ఎలా వెళ్లారని ఆమెని ప్ర‌శ్నిస్తూ అనారోగ్య కథలు అంతా ఒట్టివే అని తిట్టిపోస్తున్నారు. కనీసం నడవడానికి ఒపిక లేని దానివి కోట్లు విలువ చేసే నగలు ఎలా పెట్టుకుని వెళ్తున్నావ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here